Karunakaran : ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్.. బెల్లంకొండ హీరోతో..
కరుణాకరన్ అంటే క్యూట్ లవ్ స్టోరీ సినిమా తీస్తాడు అనే మార్క్ ఉంది. (Karunakaran)
Karunakaran
Karunakaran : పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన కరుణాకరన్ ఆ తర్వాత యువకుడు, వాసు, బాలు, హ్యాపీ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీ కోసం.. లాంటి మంచి సినిమాలు అందించారు. కరుణాకరన్ సినిమాల్లో కొన్ని కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా క్లాసిక్స్ గా మిగిలాయి. కరుణాకరన్ చివరగా 2018లో సాయి ధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు అనే సినిమా తీశారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది.
అప్పట్నుంచి సినిమాలకు దూరంగా ఉన్న కరుణాకరన్ సడెన్ గా నేడు తన కొత్త సినిమాని ప్రకటించారు. అది కూడా బెల్లంకొండ గణేష్ తో. బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ డైలాగ్స్ రాస్తుండటం విశేషం.
Also Read : Vijay Deverakonda : నాని గెస్ట్ గా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు వైరల్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా గణేష్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్వాతి ముత్యం, నేను స్టూడెంట్ సర్ సినిమాలతో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో తన మూడో సినిమాతో రాబోతున్నాడు. కరుణాకరన్ అంటే క్యూట్ లవ్ స్టోరీ సినిమా తీస్తాడు అనే మార్క్ ఉంది. మరి ఇప్పుడు ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

