Nani Kasaragadda
Nani Kasaragadda : సినీ పరిశ్రమలో చాలా మంది తమ ఫ్యామిలీలను కూడా ఇదే పరిశ్రమలోకి తీసుకొస్తారు. అలా ఓ డైరెక్టర్ తన తండ్రి సాధించకుండా చనిపోయాడు అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న 12A రైల్వే కాలనీ సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Nani Kasaragadda)
ఈ సినిమాతోనే నాని కాసరగడ్డ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన గోల్ ఎప్పటికైనా ఇలాంటి స్టేజ్ ఎక్కాలి అనుకున్నారు. కానీ ఆయన అదృష్టం బాగోలేక 2014 లో చనిపోయారు. ఆయన నాతో ఒక మాట అనేవారు. నాకు లక్ రావడం లేదు రా.. నువ్వు మాత్రం ఎప్పటికైనా సినిమా కొట్టాలిరా అని. నాన్నా.. ఈరోజు నేను స్టేజ్ ఎక్కా. ఇక్కడికి రావడానికి 15 ఏళ్ళు పట్టింది. పై నుంచి నువ్వు చూస్తున్నావని కోరుకుంటున్నాను. స్టేజి ఎక్కాను. థ్యాంక్యూ సో మచ్ నాన్న అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also See : Akhanda 2 : ‘అఖండ 2’ జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య బాబు స్టెప్స్ అదుర్స్..
అలాగే తన చెల్లిని పరిచయం చేస్తూ.. ఈమె నా చెల్లి త్రివేణి. దాదాపు 15 ఏళ్ళు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే తన శాలరీని నాకు ఇచ్చి సపోర్ట్ చేసింది. నాకు బైక్ కూడా లేకపోతే తనే కొనిచ్చింది అని తెలిపాడు. అలా 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కష్టపడి చెల్లి సపోర్ట్ తో డైరెక్టర్ అయ్యాడు నాని. తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోకపోయినా కొడుకు సాధించాడు అని ఈ అన్నాచెల్లెళ్ళను అభినందిస్తున్నారు నెటిజన్లు.
Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్.. ఈ అందాల భామ ఎవరో తెలుసా?