Ugram Twitter Review : ఉగ్రం ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ ఉగ్రరూపం చూపించాడు అంటున్న ప్రేక్షకులు..
ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఉగ్రం సినిమా షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్లంతా అల్లరి నరేష్ యాక్టింగ్ అదరగొట్టేశాడని, BGM, కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
- Saketh U
- Updated on- May 5, 2023 / 08:04 AM IST
Allari Naresh Ugram Movie Twitter Review and Audience Rating for Ugram Movie
Ugram Twitter Review : అల్లరి నరేష్(Allari Naresh), మిర్నా జంటగా నాంది(Nandi) దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఉగ్రం(Ugram) సినిమా నేడు మే 5న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాంది డైరెక్టర్ తో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ కాంబోపై మరిన్ని అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఉగ్రం సినిమా షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్లంతా అల్లరి నరేష్ యాక్టింగ్ అదరగొట్టేశాడని, BGM, కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే లవ్ సీన్స్, కొన్ని చోట్ల సాగదీయడం సినిమాకు మైనస్ అవుతుంది అంటున్నారు. ఓవరాల్ గా చాలా మంది బాగుందనే చెప్తున్నారు. ఇప్పటికే సినిమా చూసేసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
