Allari Naresh : రెండు ఫ్లాప్స్ తీసిన దర్శకుడితో.. సినిమా చేయాలని ఉందన్న అల్లరి నరేష్..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు కామెడీ పండించే దర్శకులతో సినిమాలు చేయాలని ఉందని తెలిపాడు. (Allari Naresh)
- Saketh U
- Updated on- September 3, 2026 / 10:48 AM IST
Allari Naresh
Allari Naresh : ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా ప్రయోగాలు చేస్తూ వైఫల్యాలు చూస్తున్నారు. అల్లరి నరేష్ చివరి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు రంభ ఊర్వశి మేనక అనే కామెడీ సినిమాతో మళ్ళీ తన జానర్లోకి వచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు కామెడీ పండించే దర్శకులతో సినిమాలు చేయాలని ఉందని తెలిపాడు.
Also See : Sameera Bharadwaj : రాహుల్ సిప్లిగంజ్ కి రాఖీ కట్టిన సింగర్ సమీరా భరద్వాజ్.. ఫొటోలు..
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇప్పుడు కామిడీ చాలా రూపాంతరం చెందింది. నేను గతంలోనే స్పూఫ్ లతో పాటు అనేక కామెడీ సినిమాలు చేశాను. ఇప్పుడు నాకు రితేష్ రానా తో సినిమా చేయాలని ఉంది. అతను తీసిన మత్తు వదలరా సినిమా చాలా బాగుంటుంది. అలాంటి కామెడీలో నటించాలని ఉంది. అలాగే తరుణ్ భాస్కర్ తీసిన ఈ నగరానికి ఏమైంది? సినిమాలో కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. తరుణ్, రితేష్ లతో ఛాన్స్ వస్తే వదులుకోను అని తెలిపాడు.
రితేష్ రానా దర్శకుడిగా నాలుగు సినిమాలే చేసాడు. మత్తు వదలరా రెండు పార్టులు హిట్ అవ్వగా, హ్యాపీ బర్త్ డే, జెట్లీ మాత్రం ఫ్లాప్ అయ్యాయి. అతని కామెడీ సెన్స్, డైలాగ్స్ మాత్రం బాగుంటాయి. అందుకే అల్లరి నరేష్ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి తరుణ్, రితేష్ ఇద్దరిలో అల్లరి నరేష్ కి ఎవరు కథ వినిపించి సినిమా ఓకే చేసుకుంటారో చూడాలి.
Also See : Surabhi : ‘రంభ ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన సురభి..
