Allu Arha : తిరుమలలో అల్లు ఫ్యామిలీ.. అర్హ క్యూట్ వీడియో వైరల్..

తిరుమల దేవాలయాన్ని సందర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, కూతురు అర్హ. దేవాలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు అల్లు అర్హ చేసిన పని..

Allu Arha cute video with her mother sneha reddy at tirumala temple gone viral

Allu Arha : అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, కూతురు అర్హ తిరుమల దేవాలయాన్ని సందర్శించుకున్నారు. డిసెంబర్ 7 గురువారం ఉదయం ఈ అల్లు ఫ్యామిలీ శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవుడి దర్శనం తరువాత దేవాలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు అల్లు అర్హ చేసిన పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అర్హ అసలు ఏం చేసింది..?

అల్లు ఫ్యామిలీ ఫోటోలు తీసేందుకు మీడియా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి నుంచి బయటకి వచ్చిన తరువాత స్నేహ రెడ్డి ప్రెస్ వాళ్లకు కొన్ని ఫోటోలు ఇచ్చారు. కానీ అర్హ మాత్రం తన మొఖం కనిపించకుండా దాచుకుంటూ వచ్చింది. చివరి వరకు అర్హ తన పేస్ ని దాచుకుంటూనే వచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అందరూ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

Also read : Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి అభినందనలు.. ట్వీట్ వైరల్..

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఇటీవల షూటింగ్ అల్లు అర్జున్ అస్వస్థకు గురి కావడంతో షూటింగ్ ని నిలిపివేశారు. బన్నీ వెన్ను నొప్పితో బాధ పడుతున్నారట. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా పుష్ప నటుడు అరెస్ట్ అవ్వడం అందర్నీ షాక్ కి గురి చేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశ‌వ పాత్ర‌లో న‌టించిన జ‌గ‌దీశ్‌ ఓ మ‌హిళ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యకు కారణమయ్యాడని చెబుతున్నారు.

ఆ మ‌హిళ జూనియర్ ఆర్టిస్టు ఓ వ్య‌క్తితో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌దీశ్ ఆమెకు తెలియ‌కుండా ఫోటోలు తీశాడని, ఆ ఫోటోల సాయంతో ఆమెను బెదిరించాడని, దీంతో ఆ మ‌హిళ మ‌న‌స్థాపానికి గురై, ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిందని చెబుతున్నారు. జ‌గ‌దీశ్‌ను బుధ‌వారం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో కూడా హాజ‌రుప‌రిచారు.