Pushpa 2 Song : ‘పుష్ప 2 నుండి పీలింగ్స్ ఫుల్ సాంగ్ వచ్చేసింది’.. శ్రీవల్లి, పుష్ప రాజ్ స్టెప్స్ తో అదరగొట్టారుగా..

తాజాగా పీలింగ్స్ పూర్తి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Allu Arjun Pushpa 2 movie Peelings full song released

Pushpa 2 Song : అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ సైతం జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల పీలింగ్స్ అనే సరికొత్త సాంగ్ ప్రోమో సైతం రిలీజ్ చేసారు.

Also Read : Fahadh Faasil : ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డా.. పుష్ప నటుడు కామెంట్స్..

తాజాగా పీలింగ్స్ పూర్తి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ ప్రోమో మలయాళంలో ఉంది. సాంగ్ లో పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉన్నాయి. ఆ తర్వాత నుండి తెలుగులో సాంగ్ కంటిన్యూ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటను శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాసు ఆలపించారు. పీలింగ్స్ సాంగ్ మీరు కూడా వినేయండి..


ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప ఐటెమ్ సాంగ్ నెట్టింట దుమ్ములేపుతుంది. ఇప్పుడొచ్చిన పీలింగ్స్ సాంగ్ సైతం సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.