Fahadh Faasil : ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డా.. పుష్ప నటుడు కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో పాటు తన నటన ప్రస్థానం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఒక సినిమా చేసినందుకు బాధపడ్డాను అని తెలిపాడు.

Fahadh Faasil says Feeling Sad for acted in a movie Details Here
Fahadh Faasil : మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ మళయాలంలో హీరోగా చేస్తూనే నెగిటివ్స్ రోల్స్ కూడా చేసి మెప్పించాడు. మలయాళం సినిమాలతోనే తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు దగ్గరయి ఇప్పుడు ఇక్కడ కూడా సినిమాలు చేస్తున్నాడు. పుష్ప 1 సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించి పార్టీ లేదా పుష్ప అని అదరగొట్టాడు ఫహద్ ఫాజిల్. పుష్ప 2 సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండబోతుంది ఫహద్ ఫాజిల్ కు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో పాటు తన నటన ప్రస్థానం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఒక సినిమా చేసినందుకు బాధపడ్డాను అని తెలిపాడు.
Also Read : Rashmika Mandanna : పుష్ప 2 సినిమాకు రష్మిక మందన్న డిసెంబర్ సెంటిమెంట్ కలిసొస్తుందా?
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. మామన్నన్ సినిమా కథ నచ్చే పాత్ర ఒప్పుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డాను. నాకు చిన్నప్పట్నుంచి కుక్కలంటే ఇష్టం. కానీ ఆ సినిమాలో కుక్కల్ని క్రూరంగా చంపుతాను. సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్ర చూసి నేను ఏడ్చేసాను. అందుకే ఆ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నాను అని తెలిపారు.
ఉదయనిధి స్టాలిన్, వడివేలు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మామన్నన్ సినిమాలో ఫహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఈ పాత్రకు పలు అవార్డులు కూడా వచ్చాయి. త్వరలో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.