Allu Arjun – Rashmika : విమానంలో పుష్ప – శ్రీవల్లి సందడి.. రష్మిక చేతికి ఏమైంది..?

విమానంలో అల్లు అర్జున్ - రష్మిక సరదగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటో మూవీ యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Allu Arjun and Rashmika Mandanna arrived in Kerala Photos goes Viral

Allu Arjun – Rashmika : ఆలు అర్జున్ పుష్ప 2 సినిమా నేడు కేరళలో ఈవెంట్ నిర్వహించనున్నారు. దీంతో అల్లు అర్జున్, రష్మికతో పాటు మూవీ యూనిట్ కేరళ వెళ్లారు. కేరళ కొచ్చిలో నేడు సాయంత్రం పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడి బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన అల్లు అర్జున్, రష్మిక కొద్దిసేపటి క్రితమే కొచ్చిలో దిగారు.

Also See : Aditi Rao Hydari – Siddharth : మళ్ళీ పెళ్లి చేసుకున్న సిద్దార్థ్ – అదితి రావు హైదరి.. ఫొటోలు చూశారా?

అయితే విమానంలో అల్లు అర్జున్ – రష్మిక సరదగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటో మూవీ యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. పుష్ప – శ్రీవల్లి మంచి సందడి చేస్తున్నారుగా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల్లో రష్మిక చేతికి కట్టు వేసుకొని ఉండటంతో చేతికి ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చెయ్యి బెణికితే లేదా నొప్పి పెడితే ఇలాంటి కట్టు వేసుకుంటారు కాబట్టి చిన్న సమస్యే అని తెలుస్తుంది.

ఇక బన్నీ, రష్మిక కొచ్చిలో అడుగుపెట్టిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. బన్నీ కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బన్నీ అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. పాట్నా, చెన్నైలో పుష్ప 2 ఈవెంట్స్ గ్రాండ్ గా నిర్వహించి ఇప్పుడు కేరళలో ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుండటంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.