Allu Arjun : పాట్నా గడ్డ మీద అడుగు పెట్టిన అల్లు అర్జున్.. ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా జనాలు, మీడియా..

మధ్యాహ్నం అల్లు అర్జున్, రష్మిక హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలుదేరారు.

Allu Arjun and Rashmika Mandanna Landed in Patna for Pushpa 2 Trailer Launch Event

Allu Arjun : నేడు పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా బీహార్ లో జరగనుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మిక హాజరు అవుతున్నారు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వద్ద ఇంటికే భారీగా జనాలు చేరుకున్నారు. ఆల్మోస్ట్ 1200 మంది పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఈవెంట్ దగ్గర ఉన్నారు.

Also Read : Pushpa 2 : వామ్మో.. ఏకంగా 1200 మంది సెక్యూరిటీతో పుష్ప 2 ఈవెంట్.. బీహార్ చరిత్రలోనే మొదటిసారి.. అల్లు అర్జున్ హవా..

ఇవాళ మధ్యాహ్నం అల్లు అర్జున్, రష్మిక హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలుదేరారు. తాజాగా అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు చేరుకున్నారు. అల్లు అర్జున్ కు పాట్నాలో ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ బయటే మీడియా, ఫ్యాన్స్, జనాలు అల్లు అర్జున్ ని చూడటానికి భారీగా తరలి వచ్చారు. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు.

ఈవెంట్ వద్దే అనుకుంటే ఎయిర్ పోర్ట్ వద్ద కూడా ఈ రేంజ్ జనాల్ని చూసి షాక్ అవుతున్నారు. పుష్పతో అల్లు అర్జున్ నార్త్ లో బాగా పాతుకుపోయాడు, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని అంతా అంటున్నారు. అల్లు అర్జున్ పాట్నా ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను ఇక్కడ చూడండి..