Pushpa 2 : వామ్మో.. ఏకంగా 1200 మంది సెక్యూరిటీతో పుష్ప 2 ఈవెంట్.. బీహార్ చరిత్రలోనే మొదటిసారి.. అల్లు అర్జున్ హవా..
పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.

Allu Arjun Pushpa 2 Trailer launch event in Patna Creates New Records
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా బీహార్ రాజధాని పాట్నాలోని ఓ మైదానంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడ భారీగా బన్నీ ఫ్యాన్స్, ప్రేక్షకులు చేరుకొని సందడి చేస్తున్నారు. నిన్నటి నుంచే పాట్నాలో పుష్ప సందడి మొదలైంది. అల్లు అర్జున్ హవా నార్త్ లో రోజు రోజుకి పెరిగిపోతుంది. బన్నీకి నార్త్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే అర్థమయిపోతుంది.
ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. పాట్నాలో ఈ రేంజ్ లో భారీగా జరుగుతున్న మొదటి సినిమా ఈవెంట్ ఇదే. ఈవెంట్ కు భారీ స్పందన రావడం, జనాలు కూడా భారీగా రావడంతో బీహార్ ప్రభుత్వం ఈవెంట్ వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేసింది. 900 మంది పోలీసులను, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Also Read : Kantara Chapter 1 : ‘కాంతార’ ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..
ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బీహార్ గవర్నమెంట్ ఏకంగా 1200 మంది సెక్యూరిటీని ఇవ్వటం ఇదే మొదటిసారి. ఆ రేంజ్ లో నార్త్ లో పుష్ప2 క్రేజ్ ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా పుష్ప 2 నిలవనుంది. ఈ పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Patnaa police lu తగ్గేదేలే — అస్సలు తగ్గేదేలే 🔥❤️🔥 pic.twitter.com/u1jIvI4qer
— Eluru Sreenu (@IamEluruSreenu) November 17, 2024