Kantara Chapter 1 : ‘కాంతార’ ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

కాంతార కన్నడతో పాటలు దేశంలోని వేరే భాషల్లో కూడా రిలీజయి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది.

Kantara Chapter 1 : ‘కాంతార’ ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

Rishab Shetty Kantara Chapter 1 Release Date Announced

Updated On : November 17, 2024 / 4:08 PM IST

Kantara Chapter 1 : కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా కాంతార. హోంబలె ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ సినిమా కేవలం 16 కోట్లతో తెరకెక్కింది. 2022లో రిలీజయిన కాంతార సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాంతార సినిమా కన్నడ సినీ పరిశ్రమలోని చిన్న సినిమాలకు మంచి హైప్ ఇచ్చింది.

కాంతార కన్నడతో పాటలు దేశంలోని వేరే భాషల్లో కూడా రిలీజయి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా ఆల్మోస్ట్ 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి నేషనల్ వైడ్ స్టార్ హీరో అయ్యాడు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. తాజాగా కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Trivikram – Sunil : త్రివిక్రమ్, సునీల్‌తో పాటు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకే రూమ్.. చాప మీద పడుకొని.. అర్ధరాత్రి పూట..

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమా 2025 అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో రిషబ్ ఫ్యాన్స్, కాంతార సినిమా ఫ్యాన్స్ ఈ సినిమా ప్రీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంతార ప్రీక్వెల్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

 

Image