Trivikram – Sunil : త్రివిక్రమ్, సునీల్‌తో పాటు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకే రూమ్.. చాప మీద పడుకొని.. అర్ధరాత్రి పూట..
త్రివిక్రమ్ - సునీల్ తో పాటు ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ రూమ్ లోనే ఉన్నాడట.

A Star Music Director also Share Room With Trivikram Srinivas and Sunil
Trivikram – Sunil : అందరికి త్రివిక్రమ్, సునీల్ మంచి ఫ్రెండ్స్ అని, ఇద్దరూ ఒకే ఊరి వాళ్ళు అని, సునీల్ త్రివిక్రమ్ ను సినీ పరిశ్రమకు తీసుకొచ్చాడని తెలుసు. ఇద్దరూ కలిసి స్టార్స్ గా ఎదగకముందు ఒకే రూమ్ లో బ్యాచిలర్ లైఫ్ గడిపారని అందరికి తెలిసిందే. సునీల్, త్రివిక్రమ్ కూడా అనేక మార్లు వాళ్ళ బ్యాచిలర్ లైఫ్ గురించి, ఇద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉన్నప్పటి అనేక విషయాలు చెప్పారు.
అయితే త్రివిక్రమ్ – సునీల్ తో పాటు ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ రూమ్ లోనే ఉన్నాడట. ఆయన ఎవరో కాదు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, దర్శకుడు RP పట్నాయక్. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆర్పీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేసి మెప్పించాడు.
Also Read : Thaman : మెగా వర్సెస్ నందమూరి.. మధ్యలో తమన్.. సంక్రాంతిని ఏం చేస్తాడో..
తాజగా ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. నేను, త్రివిక్రమ్, సునీల్ రూమ్మేట్స్. వాళ్ళు ఇద్దరు మొదట కలిసి ఉండేవారు. ఆ తర్వాత నేను వాళ్ళ రూమ్ లో జాయిన్ అయ్యాను. మూడేళ్లు కలిసి ఉన్నాము. మా రూం దగ్గర నిమ్స్ హాస్పిటల్ ఉండేది. అక్కడ అర్ధరాత్రి దోశలు వేసేవారు. అవి తినడానికి సునీల్ వెయిట్ చేసేవాడు. అక్కడికి వెళ్లి తిందాం అనేవాడు. శ్రీను లిరిక్స్ రాస్తే నేను ట్యూన్ కట్టేవాడ్ని, అది సునీల్ ఎలా ఉందో చెప్పేవాడు. అప్పుడు మాకు దుప్పట్లు కూడా లేవు, చాప మీదే పడుకునే వాళ్ళం. ఆ రోజులు వేరు అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.