Thaman : మెగా వర్సెస్ నందమూరి.. మధ్యలో తమన్.. సంక్రాంతిని ఏం చేస్తాడో..
తమన్ రెండు సినిమాలు ఒకే సీజన్ లో రిలీజవుతున్నాయి. తను చేసిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడబోతున్నాయి.

Music Director Thaman Game Changer Daaku Maharaaj Movies fight in Sankranthi
Thaman : ఒక స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికే కష్టపడతారు టాప్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్లు. సినిమాకి హైప్ తెచ్చేది మ్యూజికే కాబట్టి చాలాకేర్ ఫుల్ గా చేసి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తారు. అలాంటిది తమన్ రెండు సినిమాలు ఒకే సీజన్ లో రిలీజవుతున్నాయి. తను చేసిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడబోతున్నాయి.
సౌత్ లో స్పెషల్లీ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పెద్దా చిన్నా అని తేడా లేకుండా వరసపెట్టి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాడు. తమన్ ప్రస్తుతం చేస్తున్నప్రాజెక్ట్స్ లో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు బాలకృష్ణ, రామ్ చరణ్ తో చేస్తున్నవి. బాలయ్య తో డాకు మహరాజ్, చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు మామూలుగా రిలీజ్ అయితే ఓకే. కానీ ఒకే సీజన్ లో అది కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడంతో తన సినిమాతో తానే పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది తమన్ కి. గేమ్ చేంజర్ జనవరి 10 రిలీజవుతుంటే డాకు మహరాజ్ జనవరి 12న థియేటర్లోకొస్తోంది.
Also Read : Nikhil : నన్ను క్షమించు.. కావాలంటే కొట్టు.. నాకు నువ్వు కావలి ప్లీజ్ అంటూ ఏడ్చేసిన నిఖిల్..
తమన్ ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయ్యారు. నిజానికి ఈ రెండు సినిమాలు తమన్ కి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే. ఒకటి స్టైలిష్ క్లాస్ మూవీ అయితే రెండోది మాస్ రగ్డ్ మూవీ. అయితే శంకర్ తో పని చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్న తమన్ గేమ్ ఛేంజర్ తో ఆ కోరిక తీరిపోయిందని, అసలు ఫస్ట్ పాటలు షూట్ చేశాకే శంకర్ సీన్స్ షూటింగ్ చేశారని చెబుతున్నారు. అంతలా సినిమాలో ఉన్న పాటలు శంకర్ ని ఇంప్రెస్ చేశాయని, ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు తమన్. ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన పాటలు ఫ్యాన్స్ కి ఊపు తెప్పిస్తున్నాయి. త్వరలోనే మరో సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారని హింట్ ఇచ్చారు తమన్.
ఇక గేమ్ ఛేంజర్ తో పాటు బాలకృష్ణ తో చేస్తున్న డాకు మహరాజ్ కూడా తమన్ కి క్రూషియల్ ప్రాజెక్టే. ఎందుకంటే అఖండతో వీళ్లిద్దరి కాంబినేషన్ మీద విపరీతమైన హైప్ ఉంది. అంతే కాదు బాలయ్య-తమన్ కాంబినేషన్లో ఇది 5వ సినిమా. ఈ క్రేజీ కాంబినేషన్లో రిలీజైన ప్రతి సినిమా ఆడియోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది. అందులోనూ డాకూ మహరాజ్ మాస్ పీరియాడిక్ మూవీ కావడం, బాలయ్య ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి బాగా క్రేజ్ ఉండడంతో ఫ్యాన్స్ తమన్ ఇచ్చే మ్యూజిక్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. అందుకే ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా లేటెస్ట్ గా రిలీజైన టీజర్ మ్యూజిక్ తో ఆల్రెడీ ఇంప్రెస్ చేసేశారు తమన్. ఇలా గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే టైమ్ లో రిలీజ్ అవుతుండడంతో ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుందో అన్న ఇంట్రస్ట్ అటు ఆడియన్స్ తో పాటు తమన్ కూడా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఒకటి మెగా ఫ్యామిలీ సినిమా కావడం, మరొకటి నందమూరి ఫ్యామిలీ సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా తమన్ ఎవరికీ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అని వెయిట్ చేస్తున్నారు. రెండు హిట్ అయి మంచి పేరు వస్తే తమన్ ఫుల్ హ్యాపీ. ఇరు అభిమానులను తమన్ సంక్రాంతికి మెప్పిస్తాడా లేదా చూడాలి.