Nikhil : నన్ను క్షమించు.. కావాలంటే కొట్టు.. నాకు నువ్వు కావలి ప్లీజ్ అంటూ ఏడ్చేసిన నిఖిల్..

నిఖిల్ లవ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Nikhil : నన్ను క్షమించు.. కావాలంటే కొట్టు.. నాకు నువ్వు కావలి ప్లీజ్ అంటూ ఏడ్చేసిన నిఖిల్..

Actor Nikhil Cried after saying his Love Storty in Bigg Boss

Updated On : November 17, 2024 / 2:56 PM IST

Nikhil Maliyakkal : కన్నడ నటుడు నిఖిల్ తెలుగు సీరియల్స్ లో బిజీ అయి మంచి పేరు, ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ ఇప్పుడు బిగ్ బాస్ లో దూసుకెళ్తున్నాడు. ఇన్నాళ్లు చాలా స్ట్రాంగ్ గా కనపడిన నిఖిల్ నిన్నటి ఎపిసోడ్ లో తన ప్రేమ గురించి చెప్పి ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేమ కథలు చెప్పమని అడగడంతో పలువురు తమ ప్రేమ కథలు చెప్పారు.

ఈ క్రమంలో నిఖిల్ తన ప్రేమ కథ గురించి చెప్తూ.. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడే తనే అని ఫిక్స్ అయ్యాను. తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలు మర్చిపోయేలా చేసింది. ఆరేళ్ళ రిలేషన్ మాది. విడిపోయారా అంటే నేను అయితే విడిపోలేను. ఫ్యూచర్ లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా తనతో ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు. అబ్బాయి ఒక్కసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూడము. నేను ఫిక్స్ అయ్యాను తను నా వైఫ్ అని. ఎక్కడికి వెళ్లినా తనే గుర్తొస్తుంది. ఈ జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది. తనే నాకు లాస్ట్. విడిపోయినప్పుడు చాలా కోపం వచ్చింది. నా తప్పు కూడా ఉంది. నేను కూడా లైట్ అనుకున్నా. కొన్ని నెలల పాటు మాట్లాడలేదు. మా అమ్మలాగే వచ్చింది. కానీ నేను ఇప్పటికి గివ్ అప్ ఇవ్వట్లేదు. ఈ షో తర్వాత నేను వస్తాను నువ్వు మళ్ళీ కోప్పడతావు. కోప్పడు పడతాను, తిట్టు పడతాను, కొట్టావు మళ్ళీ కొట్టు పడతాను. సారీ. ఈ షో నుంచి బయటకు రాగానే నీ దగ్గరకు వస్తాను, మళ్ళీ అడుగుతాను. నా అదృష్టం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసింది. నువ్వు ఏమి చెయ్యకు నీ వెనక నేను నిలబడతా. నా పక్కన నిలబడు చాలు. నేనేమన్నా తప్పు చేస్తే క్షమించు. నాకు నువ్వు కావాలి బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వు కూడా అలాగే దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. లవ్ యు సో మచ్ అంటూ ఏడ్చేశాడు.

నిఖిల్ లవ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక నిఖిల్ ఏడ్చేయడంతో అవినాష్ దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. అయితే నిఖిల్ – సీరియల్ యాక్టర్ కావ్య ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిఖిల్ చెప్తున్న దాని బట్టి తను చెప్పింది వేరే అమ్మాయి అని తెలుస్తుంది. మరి ఆ అమ్మాయి ఎవరో? లేక తను కావ్యనేనా తెలియాలి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నిఖిల్ ఆమె దగ్గరకు వెళ్తే ఆమె ఒప్పుకోవాలని నిఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.