Allu Arjun : అతనికి మ్యూజిక్ అవసరం లేదు.. సిద్ శ్రీరామ్‌ని పొగిడేసిన బన్నీ
తాజాగా సిద్ ని అభినందిస్తూ తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ''నా సోదరుడు సిద్ శ్రీరామ్ పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి పాట పాడుతున్నాడు. మ్యూజిక్.......
- Saketh U
- Published On : January 30, 2022 / 10:21 AM IST
Sid Sriram
Sid Sriram : టాలీవుడ్‌లో ప్రస్తుతం సిద్ శ్రీరామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని పాడిన ప్రతి పాట హిట్ అవుతుంది. జనాల్లో అతని సాంగ్స్ కి పిచ్చ క్రేజ్ ఉంది. యూత్ అతని పాటలకి అలవాటు పడిపోయారు. సిద్ నుంచి పాట వచ్చిందంటే అది కచ్చితంగా హిట్ అని ఫిక్స్ అయిపోయారు. ఇక సిద్ పాట ఉంటే సినిమాకి కూడా ప్లస్ అవుతుంది. దీంతో తాము తీసే ప్రతి సినిమాలోనూ అతని పాట ఒకటి కచ్చితంగా ఉండాలని హీరోలు, దర్శక, నిర్మాతలు ఆశపడుతున్నారు.
సిద్ అల్లుఅర్జున్ సినిమాల్లో వరుసగా పాడుతున్నాడు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో తను పాడిన శ్రీవల్లి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా సిద్ ని అభినందిస్తూ తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ”నా సోదరుడు సిద్ శ్రీరామ్ పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి పాట పాడుతున్నాడు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే తను పాట పాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మ్యూజిక్ స్టార్ట్ కాలేదు. తను మ్యూజిక్ లేకుండా పాడుతూనే ఉన్నాడు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. తన గొంతు చాలా మ్యాజికల్‌గా ఉంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. తనకు సంగీతం అవసరం లేదు. తనే సంగీతం” అని ట్వీట్ చేసాడు బన్నీ.
Ananya Panday : షారుఖ్‌ఖాన్ లాంటి అబ్బాయి కావాలి : లైగర్ భామ
ఈ ట్వీట్ తో పాటు ఆ ఈవెంట్ లో సిద్ పాడిన పాట క్లిప్ ని కూడా జత చేసాడు. దీంతో సిద్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం సిద్ చాలా బిజీగా ఉన్నాడు. ప్రతి తెలుగు సినిమాలోనూ అతని పాట కనపడుతూనే ఉంది. వినపడుతూనే ఉంది. సిద్ శ్రీరామ్‌తో పాట పాడిస్తే కచ్చితంగా హిట్ అనే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్లలో సిద్ శ్రీరామ్ కూడా ఒకడు.
? @sidsriram pic.twitter.com/P1D7feiCOD
— Allu Arjun (@alluarjun) January 29, 2022
