Ananya Panday : షారుఖ్‌ఖాన్ లాంటి అబ్బాయి కావాలి : లైగర్ భామ

తాజాగా ఇటీవల ఇచ్చిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనన్య తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. ''ప్రేమ విషయంలో నాకు కొన్ని ఫిక్సడ్ అభిప్రాయాలు ఉన్నాయి. పవిత్రమైన ప్రేమను అంత సులభంగా......

Ananya Panday : షారుఖ్‌ఖాన్ లాంటి అబ్బాయి కావాలి : లైగర్ భామ

Ananya Panday

Updated On : January 30, 2022 / 9:46 AM IST

Ananya Panday :   బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండ’ లైగర్’ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘లైగర్’ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే అనన్యకి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అనన్య బాలీవుడ్ లో సిద్దాంత్ చతుర్వేది, దీపికా పదుకునే కలిసి నటించిన ‘గెహ్రాయాన్‌’ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది అనన్య.

Kapil Sharma : తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్ళాను.. పిలవని పార్టీకి వెళ్లడంతో..

తాజాగా ఇటీవల ఇచ్చిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనన్య తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. ”ప్రేమ విషయంలో నాకు కొన్ని ఫిక్సడ్ అభిప్రాయాలు ఉన్నాయి. పవిత్రమైన ప్రేమను అంత సులభంగా నిర్వచించలేను. చిన్నతనం నుంచి నేను షారుఖ్‌ఖాన్‌ ప్రేమ కథా చిత్రాలు చూసి పెరిగాను. ఆ సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆ సినిమాల్లోని గొప్ప, ఆదర్శ భావాలున్న కథానాయకుడు అంటే చాలా ఇష్టం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. ఒకర్నొకరు మోసం చేసుకోకుండా పారదర్శకంగా సాగే బంధాలే కలకాలం నిలిచిపోతాయి. నాకు షారుఖ్ సినిమాల్లో హీరోకి ఉండే క్యారెక్టర్ ఉన్న అబ్బాయి కావాలి” అని తెలిపింది. మరి ఆ క్యారెక్టర్స్ ఉన్న అదృష్టవంతుడు ఎవరో?