Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనతో నేను షాక్ తిన్నాను.. కోలుకోడానికి రెండు రోజులు పట్టింది..

పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మళ్ళీ ఈ ఘటనపై స్పందించారు.

Allu Arjun Comments on Sandhya Theater Tragic Issue in Pushpa 2 Success Meet

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజయి మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు రోజుల్లోనే 449 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులు సెట్ చేసింది. పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అయినందుకు మూవీ యూనిట్ నేడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

అయితే ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ వెళ్లడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయాలపాలయి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సంచలనంగా మరింది. దీనిపై అల్లు అర్జున్ ఇప్పటికే స్పందించి 25 లక్షలు కూడా ఆ కుటుంబానికి ప్రకటించారు. అయితే పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మళ్ళీ ఈ ఘటనపై స్పందించారు.

Also Read : Pawan Kalyan – Allu Arjun : కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ.. అల్లు అర్జున్ కామెంట్స్.. విబేధాలు.. వివాదాలు ముగిసినట్టేనా?

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేను గతంలో కూడా చాలా సార్లు థియేటర్స్ కి వెళ్లి చూసాను. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. మూడేళ్ళ తర్వాత సినిమా ఫ్యాన్స్ తో చూద్దామని వెళ్ళాను. అయితే సినిమా మధ్యలోనే నేను ఉంటే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి పంపించేశారు. నాకు నెక్స్ట్ డే ఉదయం ఈ ఘటన గురించి తెలిసింది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు నేను షాక్ తిన్నాను. రెస్పాండ్ అవుదామన్నా సైకలాజికల్ గా టైం పట్టింది. నాకు టైం పట్టింది దాని నుంచి రికవరీ అవ్వడానికి. ఒక మనిషి చనిపోవడంతో నేను, సుకుమార్ షాక్ అయ్యాం. మా ఎనర్జీ అంతా పోయింది. దాని నుంచి కోలుకోడానికి రెండు రోజులు పట్టింది. మేము సినిమాలు చేసేదే అందరూ ఎంజాయ్ చేయడానికి. కానీ ఇలా జరగడంతో చాలా షాక్ అయ్యాం. ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాళ్ళ లాస్ ని ఎప్పటికి మేము పూడ్చలేము. కానీ వాళ్లకు సపోర్ట్ గా ఉండటానికి 25 లక్షలు ఇస్తూనే వాళ్ల పిల్లలకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను. ఆ ఫ్యామిలీని చూసుకుంటాను అని అన్నారు.