Allu Arjun Fans Association : 3 లక్షల మంది బాలికలకు.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ఆర్గనైజ్ గా నడుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (Allu Arjun Fans Association)
- Saketh U
- Published on- September 11, 2026 / 08:36 PM IST
Allu Arjun Fans Association
Allu Arjun Fans Association : గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ఆర్గనైజ్ గా నడుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు మద్ధతుగా నిలిచింది.
ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 3 లక్షలమంది బాలికలకు దీనిపై అవగాహనా కలిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించింది.
Also Read : Srikanth Odela : ఏషనాగుల సాంగ్.. ఆట సందీప్ పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా సామాజిక బాధ్యతను సమష్టి కృషితో నిర్వహిస్తున్నారు. హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ని అభినందిస్తున్నారు.
