Mallu Arjun : మల్లు అర్జున్ కు స్వాగతం చెప్తూ కేరళలో భారీ బ్యానర్.. కాసేపట్లో పుష్ప 2 కేరళ ఈవెంట్..
కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నేడు కేరళలో జరగబోయే ఈవెంట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun Keralam Fans Welcomes with Huge Banners All Eyes on Pushpa 2 Kerala Event
Mallu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ ఉండటంతో పుష్ప ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు కేరళలో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించబోతున్నారు. కేరళలో బన్నీ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నేడు కేరళలో జరగబోయే ఈవెంట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే కేరళలో అన్ని ఆరేజ్మెంట్స్ జరిగి ఈవెంట్ ప్రారంభం అవ్వడానికి రెడీగా ఉంది. బన్నీ, రష్మిక కూడా హైదరాబాద్ నుంచి కొచ్చికి బయలుదేరారు. అయితే కేరళలో అక్కడి బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి భారీగానే స్వాగతం చెప్తున్నారు. కొచ్చి ఎయిర్ పోర్ట్ బయట అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు బన్నీ కోసం. ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్ కి వెళ్లే మధ్యలో అల్లు అర్జున్ కి స్వాగతం చెప్తూ భారీ బ్యానర్ ఏర్పాటు చేసారు.
పుష్ప 2 ఫొటోతో కేరళం వెల్కమ్స్ మల్లు అర్జున్ అంటూ భారీగా బ్యానర్ వేశారు. దీంతో ఈ బ్యానర్ వైరల్ గా మారింది. తెలుగు హీరోకి మలయాళంలో ఇంత పెద్ద బ్యానర్ వేసి వెల్కమ్ చెప్పడం విశేషమే. ఇక ఈవెంట్ కూడా భారీగా జరగబోతుందని తెలుస్తుంది.
Mallu Fans Waiting for Icon StAAr Mallu Arjun in Kochi pic.twitter.com/2Ag0yxQOWd
— Eluru Sreenu (@IamEluruSreenu) November 27, 2024