Pradeep Machiraju : యాంకర్ ప్రదీప్ నెక్స్ట్ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్..
తాజాగా నేడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు.

Pradeep Machiraju Deepika Pilli Akkada Ammayi Ikkada Abbayi First Song Released
Pradeep Machiraju : యాంకర్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని మొదటి సినిమాతో మెప్పించి ఇప్పుడు తన రెండో సినిమాతో రాబోతున్నాడు. ప్రదీప్ హీరోగా ఇటీవలే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్ తో తన రెండో సినిమాని ప్రకటించాడు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ప్రదీప్ సరసన సోషల్ మీడియా ఫేమ్, నటి దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్, భరత్‌ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది ఈ సినిమా. తాజాగా నేడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు.
Also Read : Squid Game Season 2 : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ఆటని ఆపడానికి చేసే ప్రయత్నం..
‘ఎవ్వడో ఈడికొచ్చినాడు సూడు.. సక్కగా గుండె గిల్లినాడు ఈడు.. లే లే లే..’ అంటూ సాగే ఈ పాటను శ్రీధర్ అవునూరి రాయగా రధన్ సంగీత దర్శకత్వంలో ఉదిత్ నారాయణ పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసారు. ఈ మెలోడీ సాంగ్ ని మీరు కూడా వినేయండి..
ఇక ఈ పాట చూస్తుంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. ఈ పాటని మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.
Glad to launch this beautiful melody from #AkkadaAmmayiIkkadaAbbayi
All the best to @impradeepmachi , @deepikapilli_ & the entire team. Good luck.#LeLeLeLe song out now.https://t.co/RLrp7qgg3mA wonderful composition by #Radhan and sung by my favourite #UditNarayan Ji.…
— Mahesh Babu (@urstrulyMahesh) November 27, 2024