Squid Game Season 2 : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ఆటని ఆపడానికి చేసే ప్రయత్నం..

స్క్విడ్ గేమ్ సీజన్ 1ని మించి మరింత ఉత్కంఠగా ఈ సిరీస్ ఉండబోతుందని తెలుస్తుంది.

Squid Game Season 2 : స్క్విడ్ గేమ్ 2 సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ఆటని ఆపడానికి చేసే ప్రయత్నం..

Netflix Squid Game Season 2 Trailer Released

Updated On : November 27, 2024 / 3:56 PM IST

Squid Game Season 2 Trailer : నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 2021లో కరోనా సమయంలో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ పెద్ద హిట్ అయింది. చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ కు డేంజర్ రూల్స్, భారీ బహుమతులు, శిక్షలు పెట్టి ఆసక్తికరంగా ఈ సిరీస్ ని డిజైన్ చేసారు. ఈ సిరీస్ పెద్ద హిట్ అవ్వడంతో స్క్విడ్ గేమ్ 2 కూడా ప్రకటించారు. స్క్విడ్ గేమ్ 2 సిరీస్ డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే స్క్విడ్ గేమ్ 2 నుంచి గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు స్క్విడ్ గేమ్ 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సీజన్ 1 లో గేమ్ ని గెలిచి బయటకు వచ్చిన ఒక్కడు మళ్ళీ ఈ గేమ్ లోకి వస్తాడు. ఎలాగైనా ఈ ప్రమాదకరమైన గేమ్ ని ఆపాలని అక్కడికి వచ్చినవాళ్లతో ప్రయత్నం చేస్తాడు. మరి కొత్తగా డబ్బుల కోసం ఆశపడి అక్కడికి వచ్చిన వ్యక్తులు ఇతనితో కలిసి గేమ్ ఆపడానికి ప్రయత్నిస్తారా? ఈ గేమ్ నిర్వహించేవాళ్ళు ఏం చేసారు తెలియాలంటే సిరీస్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.

Also Read : Sreeleela : రెమ్యునరేషన్ తీసుకోకుండానే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల.. ఎందుకని?

స్క్విడ్ గేమ్ సీజన్ 1ని మించి మరింత ఉత్కంఠగా ఈ సిరీస్ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే సీజన్ 3 కూడా ఉండబోతుందని సమాచారం. ఇండియాలో కూడా స్క్విడ్ గేమ్ పెద్ద హిట్ అవ్వడంతో ఇక్కడి లోకల్ భాషల్లో కూడా ఈ సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ తెలుగులో కూడా రిలీజ్ చేసారు. మీరు కూడా స్క్విడ్ గేమ్ 2 ట్రైలర్ చూసేయండి..