Sreeleela : రెమ్యునరేషన్ తీసుకోకుండానే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల.. ఎందుకని?

శ్రీలీలకు పుష్ప 2 స్పెషల్ సాంగ్ రెమ్యునరేషన్ పై ప్రశ్న ఎదురైంది.

Sreeleela : రెమ్యునరేషన్ తీసుకోకుండానే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల.. ఎందుకని?

Sreeleela Gives Clarity on Her Remuneration for Pushpa 2 Kissik Song

Updated On : November 27, 2024 / 3:14 PM IST

Sreeleela : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే పుష్ప 2 సినిమా నుంచి కిస్సిక్.. అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ సరసన శ్రీలీల డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. శ్రీలీల డ్యాన్స్ అదరగొడుతుందని తెలిసిందే. అయితే ఐటెం సాంగ్ ఒప్పుకొని చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తే రెమ్యునరేషన్స్ ఎక్కువే ఉంటుంది. ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఒక పాటకు తీసుకుంటారు. గతంలో సమంతకు ఊ అంటావా ఊ ఊ అంటావా పాటకి 3 కోట్లు ఇచ్చారని సమాచారం. దీంతో శ్రీలీలకు కూడా ఇప్పుడు భారీగానే ముట్టిందని తెలుస్తుంది. తాజాగా నేడు నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రెస్ మీట్ జరగ్గా ఈ సినిమాలో నటించిన శ్రీలీల కూడా వచ్చింది.

Also Read : Rashmika Mandanna : ‘ఏదో తెలియని బాధ’.. పుష్ప పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రష్మిక మందన్న

దీంతో శ్రీలీలకు పుష్ప 2 స్పెషల్ సాంగ్ రెమ్యునరేషన్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి శ్రీలీల సమాధానమిస్తూ.. అసలు ఇప్పటిదాకా నిర్మాతలకు – నాకు మధ్య రెమ్యునరేషన్ టాపిక్ రాలేదు అని తెలిపింది. మైత్రి నిర్మాతలు కూడా మాట్లాడుతూ.. అసలు శ్రీలీలతో మేము ఇంకా రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు అని చెప్పారు. దీంతో శ్రీలీల ప్రస్తుతానికి రెమ్యునరేషన్ లేకుండానే ఈ కిస్సిక్ సాంగ్ చేసినట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్, పుష్ప 2 సినిమా అని శ్రీలీల వెంటనే ఒప్పేసుకుంది. ప్రస్తుతానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా ముందు సాంగ్ షూట్ చేసేసినా తర్వాత మాత్రం రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మూవీ యూనిట్ అంతా సినిమా రిలీజ్ హడావిడిలో ఉండటంతో సినిమా రిలీజ్ అయ్యాక శ్రీలీల రెమ్యునరేషన్ కొలిక్కి వస్తుందని తెలుస్తుంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం కోటి రూపాయల పైనే శ్రీలీల ఈ పాటకు రెమ్యునరేషన్ తీసుకోబోతుందని తెలుస్తుంది.