Allu Arjun: తెలుగు పాట ఆస్కార్స్‌ను షేక్ చేయడం గర్వకారణం – అల్లు అర్జున్
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా.. కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఊర ‘నాటు’ పాటతో ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి విజన్.. తారక్, చరణ్‌ల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్.. విదేశీయులతో కూడా నాటు స్టెప్పులేయించిన కీరవాణి సంగీతం కలగలసి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రస్తుతం సినీ ప్రపంచం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సెల్యూట్ చేస్తోంది.
- Anil Aaleti
- Published on- March 14, 2023 / 12:06 PM IST
Allu Arjun On RRR Winning Oscar Award
Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా.. కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఊర ‘నాటు’ పాటతో ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి విజన్.. తారక్, చరణ్‌ల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్.. విదేశీయులతో కూడా నాటు స్టెప్పులేయించిన కీరవాణి సంగీతం కలగలసి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రస్తుతం సినీ ప్రపంచం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సెల్యూట్ చేస్తోంది.
ఇక ఓ తెలుగు పాట ఇలా ఆస్కార్ అవార్డును చేజిక్కించుకోవడంతో యావత్ సినిమా సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ యాక్టర్స్ రాజమౌళి అండ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ఆస్కార్ అందుకోవడంపై అభినందించాడు. ఓ తెలుగు పాట ఆస్కార్స్‌ను షేక్ చేయడం గర్వకారణంగా ఉందని బన్నీ తెలిపాడు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడానికి కారణమైన కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకు శుభాకాంక్షలు తెలిపాడు.
Oscars95: ఆర్ఆర్ఆర్ దెబ్బకు సైలెంట్ అయిన బాలీవుడ్ బ్యాచ్.. షారుక్ తప్ప మిగతావారు మ్యూట్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ మ్యాజిక్‌ను సాధ్యం అయ్యేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు అంటూ బన్నీ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇండియన్ సినిమాకు ఇది చాలా హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ బన్నీ పేర్కొన్నాడు. ఇలా ఆర్ఆర్ఆర్ చేసిన వండర్‌ను భాషాబేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ అభినందిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్ అవుతూ ఉంది.
