Allu Arjun Watch: అల్లు అర్జున్ ‘లగ్జరీ పాటెక్ వాచ్’.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
అల్లు అర్జున్(Allu Arjun) పాటెక్ ఫిలిప్పు చలిబ్రె వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Updated on- May 25, 2026 / 05:05 PM IST
allu arjun Patek Philippe Calibre watch viral on social media
- అల్లు అర్జున్ రూ.200కోట్ల క్రేజీ లైనప్
- బన్నీ చేతిలో లగ్జరీ పాటెక్ వాచ్
- కోటికి పైగా ఖరీదైన టైమ్‌పీస్
Allu Arjun: ‘పుష్ప 2’ సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. దీనికి తగ్గట్లే ఆయన తన తదుపరి చిత్రాలను అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకులతో ప్లాన్ చేస్తూ.. ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ ఇండియన్ సినీ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ హీరోగా నిలిచారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్‌లోని బన్నీ నివాసానికి వచ్చి ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అందులో అల్లు అర్జున్ చేతికి పెట్టుకున్న ఒక ఖరీదైన లగ్జరీ వాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
*Peddi: రిలీజ్ కి ముందే ‘పెద్ది’ రికార్డుల మోత.. అమెరికాలో ‘రామ్ చరణ్’ మాస్ ర్యాంపేజ్
అల్లు అర్జున్ (Allu Arjun)ధరించిన ఆ లగ్జరీ టైమ్‌పీస్ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అయిన ‘పాటెక్ ఫిలిప్ నాటిలస్’ (Patek Philippe Nautilus REF: 5712/1R-001). 40 మిమీ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ కేస్‌తో, 60 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉన్న ఈ వాచ్ స్టైల్‌కు పర్‌ఫెక్ట్ నిదర్శనం. ఇందులో ‘పాటెక్ ఫిలిప్ కాలిబర్ 240 పిఎస్’ ఆటోమేటిక్ మూవ్‌మెంట్ అమర్చబడి ఉంది. రోజ్ గోల్డ్ హ్యాండ్స్, సన్‌బర్స్ట్ బ్రౌన్ కలర్ డయల్‌తో క్లాసిక్ లుక్‌లో మెరిసిపోయే ఈ వాచ్‌లో మూన్ ఫేజ్, డేట్, స్మాల్ సెకండ్స్, పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ ధర వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దీని అధికారిక రీటైల్ ధర సుమారు రూ. 89,98,000 కాగా, మార్కెట్‌లో దీనికున్న విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత మార్కెట్ ధర సుమారు రూ.1,82,50,000 పలుకుతోంది. తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే ఐకాన్ స్టార్ స్టైలిష్ పర్సనాలిటీకి ఈ వాచ్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయింది. వాచ్ లవర్స్ కలలుగనే ఈ రేర్ కలెక్షన్‌ను బన్నీ తన చేతికి ధరించడం ఆయన రిచ్ టేస్ట్‌కు, రాయల్ లైఫ్‌స్టైల్‌కు నిదర్శనంగా నిలిచింది.
