Allu Arjun Mumbai : వామ్మో.. ముంబైలో రెంట్ హౌస్.. బన్నీ నెలకు ఎంత రెంట్ కడుతున్నాడో తెలుసా?

Allu Arjun Apartment Rent: ముంబైలో బాగా రిచ్ ఏరియా, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఉండే ఏరియా జుహూకి వెళ్తున్నారు బన్నీ. (Allu Arjun)

  • Updated on- April 23, 2026 / 04:33 PM IST

Allu Arjun Apartment Rent in Mumbai

Allu Arjun Mumbai: అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసారు. పర్మినెంట్ గా కాదు కానీ ఓ మూడేళ్లు అల్లు అర్జున్ ముంబై కి మకాం మార్చేస్తున్నారు అని చెప్పారు. ముంబైలో బాగా రిచ్ ఏరియా, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఉండే ఏరియా జుహూకి వెళ్తున్నారు బన్నీ.

ఆల్రెడీ అక్కడ సముద్రం ఫేసింగ్ లో ఓ అపార్ట్మెంట్ లో 5 bhk రెంట్ కి తీసుకున్నాడట. బన్నీ ఈ రెంట్ ఇంటికి చాలా భారీగా రెంట్ కడుతున్నాడట. మూడేళ్లకు గాను ఈ అపార్ట్మెంట్ ని తీసుకొని నెలకు ఏకంగా 16 లక్షల రూపాయలు ఆ ఇంటికి రెంట్ కట్టనున్నాడట అల్లు అర్జున్. ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Also Read : గ్రౌండ్‌లో దిగి.. ఫుట్ బాల్ గేమ్ తో అదరగొడుతున్న బాలీవుడ్ భామ.. ఫోటోలు..

ఏకంగా 16 లక్షలు రెంట్ ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ముంబై జుహూలో రెంట్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. బన్నీనే కాదు అక్కడ ఎవరు రెంట్ కి తీసుకున్నా అదే రేంజ్ లో ఉంటాయి రెంట్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుంది. ఆ తర్వాత లోకేష్ కానగరాజ్ సినిమా కూడా ముంబై లోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి అల్లు అర్జున్ ముంబైలోనే ఉండి బాలీవుడ్ హీరోల్లో ఒకడిగా ఎదగాలనుకుంటున్నాడు. అక్కడ కూడా తనకు భారీ మార్కెట్ ని ఏర్పరుచుకోవాలి చూస్తున్నాడు. మరి మూడేళ్లు ఉండి వచ్చేస్తాడా? కెరీర్ కోసం ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ ముంబైలోనే సెటిల్ అవుతాడా చూడాలి.

Also Read : సందీప్ వంగ మల్టీస్టారర్..? బాలీవుడ్ హీరోతో ప్రభాస్.. ఆ సీక్వెల్ లో..?