Pushpa 2 Movie : పుష్ప 2.. 1000 కోట్ల టార్గెట్.. అందుకే రిలీజ్ డేట్ అది సెలెక్ట్ చేసుకున్నారా?

సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం ఉండగానే ఇప్పుడే రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేశారు, అదే డేట్ ఎందుకు తీసుకున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు.

Allu Arjun Pushpa 2 Movie Target 1000 Crores Release Date Calculations

Pushpa 2 Movie : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అందరికి సర్ ప్రైజ్ ఇస్తూ నిన్న పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది 2024 ఆగష్టు 15న పుష్ప 2 సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం ఉండగానే ఇప్పుడే రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేశారు, అదే డేట్ ఎందుకు తీసుకున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ అంటే అమ్మో అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు అంతా 1000 కోట్ల కలెక్షన్స్ అయిపొయింది. ఇటీవల స్టార్ హీరోలు హైప్ ఉన్న సినిమాలు, అంచనాలతో వస్తే కచ్చితంగా 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నారు. పుష్ప 1 ఎలాంటి అంచనాలు లేకుండానే దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుష్ప 2 సినిమా యూనిట్ 1000 కోట్లను టార్గెట్ పెట్టుకుందని టాలీవుడ్ టాక్. అందుకే ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఒక సంవత్సరం ముందే డేట్ ని బ్లాక్ చేసుకున్నారు. దీంతో కొన్ని సినిమాలు అయినా ఆ డేట్ జోలికి వెళ్లకుండా ఉంటాయి. అంతే కాకుండా ఆ డేట్ చుట్టూ 5 రోజులు సెలవులు వచ్చాయి. కలెక్షన్స్ రావడానికి ఆ డేట్ బాగా ఉపయోగపడుతుంది.

Srikanth Addala : షూటింగ్‌కి సడెన్‌గా నటుడు రాకపోవడంతో విలన్‌గా మారిన దర్శకుడు..

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే హాలిడే, 16 శుక్రవారం, 17 శనివారం, 18 ఆదివారం వీకెండ్, 19 సోమవారం రాఖీ వచ్చింది. రాఖి రోజు కూడా కొంతమందికి హాలిడే ఉంటుంది, ఫ్యామిలీలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో 5 రోజులు ఫుల్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ వారం సినిమాలు వేరే ఏమి రిలీజ్ కాకపోతే ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. అందుకే కనీసం 5 రోజులు సెలవులు వచ్చే డేట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో 1000 కోట్ల టార్గెట్ కొట్టాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి పుష్ప 2 వచ్చే సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు