Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? రష్మిక భక్తి పోస్ట్ వైరల్..

సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Movie Shooting Update

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika) జంటగా వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక నేషనల్ అవార్డు కూడా అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ బాగా వైరల్ అయింది. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించారు. దీంతో సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. హైదరాబాద్ లో పలు సెట్స్ లో, రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం వైజాగ్ పోర్ట్ లో షూట్ జరిగింది. ప్రస్తుతం ఏపీలోని యాగంటి పుణ్యక్షేత్రంలో పుష్ప 2 షూట్ జరుగుతుంది. యాగంటి బసవన్న క్షేత్రం చాలా పురాతనమైనది.

Also Read : Naga Chaitanya – Samantha : ఒకే వేదికపై నాగ చైతన్య – సమంత.. కానీ.. ‘దూత 2’ వర్సెస్ ‘సిటాడెల్’

రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో.. ఇవాళ యాగంటి టెంపుల్ లో షూట్ చేసాము. ఈ చారిత్రాత్మిక టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రజలు, ప్రదేశాలు, వీరి ప్రేమ అన్ని నచ్చాయి. ఇక్కడ గుడిలో కొంత సమయం ప్రశాంతంగా గడిపాను. పుష్ప షూటింగ్ సమయం ఇది అని పోస్ట్ చేసింది. దీంతో రష్మిక పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ షూట్ లో అల్లు అర్జున్ లేడని సమాచారం. రష్మిక ఒక్కతే యాగంటి ఆలయాన్ని దర్శించుకునే సీన్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ కూడా అక్కడే షూట్ జరగనుంది. ఇక రష్మిక యాగంటి వచ్చిందని తెలియడంతో అక్కడి అభిమానులు, ప్రజలు రష్మికని చూడటానికి భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు