Naga Chaitanya – Samantha : ఒకే వేదికపై నాగ చైతన్య – సమంత.. కానీ.. ‘దూత 2’ వర్సెస్ ‘సిటాడెల్’

ముంబైలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి సమంత, నాగచైతన్య హాజరయ్యారు.

Naga Chaitanya – Samantha : ఒకే వేదికపై నాగ చైతన్య – సమంత.. కానీ.. ‘దూత 2’ వర్సెస్ ‘సిటాడెల్’

Naga Chaitanya Samantha Attends to Amazon Prime Event in Mumbai Videos goes Viral

Updated On : March 20, 2024 / 8:08 AM IST

Naga Chaitanya – Samantha : మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్ ల గురించి స్పెషల్ గా ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు, మూవీ యూనిట్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక్కో సినిమాకి చెందిన వ్యక్తులని స్టేజిపైకి పిలిపించి ఆ సినిమా, సిరీస్ గురించి మాట్లాడించారు.

ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి సమంత మెయిన్ లీడ్ లో రాజ్ & డీకే దర్శకత్వంలో నటించిన సిటాడెల్(Citadel) సిరీస్ రాబోతుంది. ఈ టీం కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. సిటాడెల్ హనీ బన్నీ అనే కొత్త టైటిల్ తో ఈ సిరీస్ ని ప్రమోట్ చేసారు. ఇక ఈ ఈవెంట్ కి సమంత పక్షి రెక్కల్లా ఉండే ఓ డిజైన్ డ్రెస్ వేసుకొచ్చింది.

ఇదే ఈవెంట్ కి నాగ చైతన్య దూత 2 సిరీస్ కోసం వచ్చాడు. నాగచైతన్య మొదటిసారి దూత(Dhootha) అనే వెబ్ సిరీస్ తో గత సంవత్సరం అమెజాన్ లో రాగా ఆ సిరీస్ మంచి విజయం సాధించింది. దీంతో ఆ సిరీస్ కి సీక్వెల్ ప్రకటించారు. దూత 2 సిరీస్ ని ఈ వేదికపై ప్రకటించారు.

Also Read : Gabbar Singh : ముంబై గడ్డ మీద ‘గబ్బర్ సింగ్’ హవా.. పార్ట్ 2 చేస్తే నేను యాక్ట్ చేస్తా అంటున్న బాలీవుడ్ స్టార్..

ఈ ఈవెంట్ కి సమంత, నాగచైతన్య హాజరయ్యారు. మరి ఇద్దరూ ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? మాట్లాడారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్ లని ప్రమోట్ చేస్తుండటంతో దూత 2 వర్సెస్ సిటాడెల్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.