Gabbar Singh : ముంబై గడ్డ మీద ‘గబ్బర్ సింగ్’ హవా.. పార్ట్ 2 చేస్తే నేను యాక్ట్ చేస్తా అంటున్న బాలీవుడ్ స్టార్..

ముంబైలో అమెజాన్ స్టేజిపై హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడటం, గబ్బర్ సింగ్ పాట పాడటం, షాహిద్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 చేస్తే యాక్ట్ చేస్తా అనడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Gabbar Singh : ముంబై గడ్డ మీద ‘గబ్బర్ సింగ్’ హవా.. పార్ట్ 2 చేస్తే నేను యాక్ట్ చేస్తా అంటున్న బాలీవుడ్ స్టార్..

Harish Shankar Devisri Prasad Speak about Gabbar Singh Movie in Amazon Movie Event at Mumbai

Updated On : March 20, 2024 / 7:41 AM IST

Gabbar Singh : నిన్న మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి స్పెషల్ గా ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక్కో సినిమాకి చెందిన వ్యక్తులని స్టేజిపైకి పిలిపించి ఆ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఈవెంట్ కి షాహిద్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక అమెజాన్ లో రానుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీం తరపున హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు నవీన్, రవిశంకర్ పాల్గొన్నారు.

స్టేజిపైకి వచ్చాక షాహిద్ కపూర్(Shahid Kapoor) సినిమా గురించి చెప్పమనడంతో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారితో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ కలిసి రెండో సారి చేయబోతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అంటూ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాడు. నేను ఒకటే చెప్తాను అతని పేరు పవన్ కళ్యాణ్ అంతే అని అన్నాడు.

అనంతరం షాహిద్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంటుందని పొగిడేసి ఓ పాట కూడా పాడమని అడిగాడు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ వర్క్ ఆల్మోస్ట్ అయిపొయింది. పాటలు కూడా అయిపోయాయి. కానీ రివీల్ చేయకూడదు. అందుకే మీ కోసం మా కాంబోలో పవన్ కళ్యాణ్ గారితోనే చేసిన సినిమా గబ్బర్ సింగ్ నుంచి పాట పాడతాను. చాలా ఎనేర్జిటిక్ సాంగ్ అది అంటూ పిల్లా నువ్వు లేని జీవితం.. పాటని పాడి వినిపించాడు. దీంతో హాల్ అంతా దద్దరిల్లిపోయింది.

హరీష్ శంకర్ ఇదే స్టేజిపై మాట్లాడుతూ.. ఇలాంటి ఎనర్జిక్ సాంగ్స్ మీకు పడితే మీ డ్యాన్స్ చూడాలని ఉంది అని షాహిద్ కపూర్ తో అనడంతో దానికి షాహిద్ రిప్లై ఇస్తూ.. ఆ సినిమాకి పార్ట్ 2 ప్లాన్ చేస్తే చెప్పండి వచ్చి యాక్ట్ చేస్తాను అని అన్నాడు.

Also Read : Pawan Kalyan : హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ గాజు డైలాగ్ చెప్పా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

ముంబైలో అమెజాన్ స్టేజిపై హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడటం, గబ్బర్ సింగ్ పాట పాడటం, షాహిద్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 చేస్తే యాక్ట్ చేస్తా అనడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా వచ్చి 12 ఏళ్ళు అయినా ఇంకా పవర్ తగ్గలేదు అంటూ పవర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ హవా ముంబైలో బాగానే కనపడింది