Pawan Kalyan : హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ గాజు డైలాగ్ చెప్పా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు. జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.

Pawan Kalyan : హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ గాజు డైలాగ్ చెప్పా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan Reaction on Ustaad Bhagat Singh Glimpse

Pawan Kalyan : త్వరలోనే ఏపీలో ఎన్నికలు ఉండటంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు ప్రస్తుతం గ్యాప్ ఇచ్చాడు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అయితే హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో పక్కనపెట్టేశారు. కానీ సడెన్ గా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

ఈ గ్లింప్స్ లో పవన్ గాజు గ్లాస్ గురించి చెప్తూ.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ వేస్తాడు. అయితే ఇది పొలిటికల్ కి ఉపయోగపడాలనే ఇపుడు ఈ గ్లింప్స్, ఆ గాజు డైలాగ్ తో రిలీజ్ చేసారని తెలుస్తుంది. ఈ డైలాగ్ పై పవన్ స్పందించారు. నిన్న రాత్రి జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.

Also Read : Vijay Deverakonda : స్టేజిపై విజయ్ దేవరకొండకు ముద్దు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో.. అర్జున్ రెడ్డి లేకపోతే..

పవన్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు. ఈ రోజు వచ్చింది అనుకుంట గ్లింప్స్. ఆ గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకు రాసావ్ అని హరీష్ శంకర్ ని అడిగితే.. అందరూ మీరు ఓడిపోయారు, ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పదునెక్కుతుంది. మీకు తెలియదు మా లాంటి ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటారు అని అన్నాడు. నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను అని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.