Pushpa 2 Song : పుష్ప 2 నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..

తాజాగా పుష్ప 2 సినిమా నుంచి రెండో పాటని విడుదల చేశారు. మీరు కూడా ఈ పాట వినేయండి.

Allu Arjun Rashmika Mandanna Sukumar Pushpa 2 Second Song Released

Pushpa 2 Song : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ గ్లింప్స్, ఓ సాంగ్ తో అంచనాలు భారీగానే పెరిగాయి. పుష్ప పుష్ప సాంగ్, స్టెప్ బాగా వైరల్ అయింది. ఇటీవలే ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. రష్మిక.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ పాడే కపుల్ సాంగ్ అని తెలిపారు. దీంతో ఈ పాట కోసం బన్నీ అభిమానులతో పాటు రష్మిక(Rashmika) అభిమానులు కూడా ఎదురుచూశారు.

తాజాగా పుష్ప 2 సినిమా నుంచి రెండో పాటని విడుదల చేశారు. మీరు కూడా ఈ పాట వినేయండి.

 

ఇక పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి కలెక్షన్స్ తో అదరగొట్టి, నేషనల్ అవార్డు సాధించిన బన్నీ పుష్ప 2తో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు