Allu arjun received 7th filmfare award for pushpa 2
Allu Arjun: పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. మాస్, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతీ ఎలిమెంట్ లో తన పీక్స్ చూపించాడు అల్లు అర్జున్. అందుకే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇందులో భాగంగానే, అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమాకి గాను మరోసారి ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా ఈ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఇది ఆయన కెరీర్ లో 7 ఫిలిం ఫేర్ అవార్డు అవడం విశేషం. యంగ్ హీరోల్లో ఇన్ని ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా కూడా అల్లు అర్జున్ టాప్ లో నిలిచాడు.
Gayatri Bharadwaj: ‘కల్ట్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో గాయత్రి భరద్వాజ్.. ఫొటోలు వైరల్
ఇక రీసెంట్ గా జరిగిన ఫిలిం ఫేర్ ఈవెంట్ లో అవార్డుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు అర్జున్. అయితే, ఫిలిం ఫేమ్ అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఈక్వల్ అయ్యాడు అల్లు అర్జున్. చిరంజీవి కూడా తన కెరీర్ లో ఇప్పటివరకు 7 ఫిలిం ఫేమ్ అవార్డులను అందుకున్నాడు. పుష్ప 2 కోసం అందుకున్న ఫిలిం ఫేర్ అవార్డుతో అల్లు అర్జున్ ఇప్పుడు మెగాస్టార్ సమానంగా నిలిచాడు.
అతి తక్కువ సినిమాలు చేసి ఈ ఫీట్ ని సాధించడం అంటే మాములు విషయం కాదు. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.