Pushpa: షూటింగ్ స్పాట్లో పర్యావరణంపై బన్నీ రిక్వెస్ట్.. మేకింగ్ వీడియో!
స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. బన్నీ సరసన గ్లామరస్ బ్యూటీ రష్మికతో పాటు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్..
- Naresh Mannam
- Published on- December 5, 2021 / 01:26 PM IST
Pushpa
Pushpa: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. బన్నీ సరసన గ్లామరస్ బ్యూటీ రష్మికతో పాటు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఇలా భారీ తారాగణం నటిస్తున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి భాగం డిసెంబర్ 17న విడుదల కానుండగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ కు ముందే ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేసిన యూనిట్ తాజాగా ఓ మేకింగ్ వీడియోను వదిలింది.
Vishnu Priya: గుండెలు తీసిన రాణి ఈ విష్ణు ప్రియా!
పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమా కాగా తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులలో సినిమా కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వందల మంది ఫైటర్లతో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. చాలారోజుల పాటు మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరగగా, ఎవరు కూడా పర్యావరణానికి హాని కలిగించకూడదని బన్నీ ముందుగానే పలు సూచనలు చేశారు. ఇది తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో చూపించారు.
Bindu Madhavi: తెలుగింటి ఆవకాయ బిర్యానీ బిందు మాధవి!
మనం తెచ్చుకున్న టీ కప్స్, పేపర్ ప్లేట్స్ అన్నీ కూడా డస్ట్ బిన్లోనే వేద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అని బన్నీ యూనిట్ కి రిక్వెస్ట్ చేయగా.. ఇదే వీడియోలో అక్కడ జరిగిన షూటింగ్ మేకింగ్ వీడియోతో పాటు రేపు ట్రైలర్ రిలీజ్ కానుందంటూ మరోమారు గుర్తు చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Katrina Kaif: వద్దనుకొంటే తెంచుకునేది కాదు.. డైవర్స్పై క్యాట్ ఎమోషనల్!
