Allu Arjun : పుష్ప సక్సెస్ మీట్స్ చాలా ప్లాన్ చేశాను.. ఇలా జరిగింది అనగానే అన్ని క్యాన్సిల్ చేశాను..

నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Allu Arjun says Cancelled all Pushpa 2 Success Events

Allu Arjun : పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నేడు అసెంబ్లీలో ఈ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read : Allu Aravind : పుష్ప రికార్డులు సాధించినా.. ఓ మూలన కూర్చొని బాధపడుతున్నాడు.. బన్నీ గురించి అల్లు అరవింద్ ఆవేదన..

ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ నాపై అన్ని తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. అలాగే.. పుష్ప పెద్ద సక్సెస్ అయింది. పుష్ప సక్సెస్ మీట్స్ చాలా చోట్ల ప్లాన్ చేసాము. కర్ణాటక, ఢిల్లీ, ముంబై.. ఇలా చాలా చోట్ల సక్సెస్ మీట్స్ అనుకున్నాము. కానీ ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత అన్ని సక్సెస్ మీట్స్, సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశాను. పదిహేను రోజులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నాను అని అన్నారు.