Allu Aravind : పుష్ప రికార్డులు సాధించినా.. ఓ మూలన కూర్చొని బాధపడుతున్నాడు.. బన్నీ గురించి అల్లు అరవింద్ ఆవేదన..
అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడారు.

Allu Aravind Emotional Comments on Allu Arjun goes Viral
Allu Aravind : సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ అవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి ఆ బాబు గురించి బాధపడుతున్నాను అని ఎమోషనల్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడారు.
Also Read : Allu Arjun : నాకు కూడా ఆ అబ్బాయి అంత ఏజ్ ఉన్న కొడుకు ఉన్నాడు.. నేనెందుకు కేర్ తీసుకోను..
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా రికార్డులు సాధిస్తుంది. ఒక తండ్రిగా బన్నీ ఇంత సక్సెస్ అయితే నేను సంతోషిస్తున్నాను. కానీ అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా ఈ గార్డెన్ లో ఓ మూలకు కూర్చొని బాధపడుతున్నాడు. నేను వెళ్లి అడిగాను చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు వెళ్ళు, కనీసం బయటకు అయినా వెళ్ళు, ఇక్కడే ఇలా ఎందుకు ఉంటావు అని చెప్పాను. కానీ తాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీ ఇలా అవ్వడంతో చాలా బాధపడుతున్నాడు. అల్లు అర్జున్ ని అలా చూస్తుంటే బాధగా ఉంది. ఇవాళ కొన్ని అబద్దపు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇచ్చారు అని తన ఆవేదనను మీడియా ముందు తెలిపారు.