Paracetamol: గర్భిణీ స్త్రీలు ప్యారసెటామోల్ వాడుతున్నారా? శిశువుకు చాలా ప్రమాదం
ప్యారసెటామోల్ (Paracetamol) అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అత్యధికంగా వినియోగించబడే ఔషధాల్లో ఇది కూడా ఒకటి.

Health problems caused by pregnant women taking paracetamol
Paracetamol: ప్యారసెటామోల్ అనేది సాధారణంగా చాలా మంది ఉపయోగించే నొప్పి తగ్గించే ఔషధం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే ఔషధాల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలకు ఈ మందును ఎక్కువగా వాడుతారు. కొన్ని సందర్భాలలో గర్భిణీ స్త్రీలు కూడా తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం లాంటి సమస్యలకు ప్యారసెటామోల్‌ను వినియోగించటం జరుగుతూనే(Paracetamol) ఉంటుంది. అయితే, ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు మాత్రం కొన్ని ఆరోగ్యపరమైన సందేహాలను సూచించింది. మరి ఆ సందేహాలు ఏమిటి? గర్భిణీలు ప్యారసెటామోల్ ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఇటీవల జరిగిన పెరిగిన పరిశోధనల ప్రకారం:
1.శిశువులో నెరో డెవలప్‌మెంట్ సంబంధిత సమస్యలు:
కొన్ని అధ్యయనాలు ప్రకారం గర్భధారణ సమయంలో ఎక్కువ కాలం, అధిక మోతాదులో ప్యారసెటామోల్ తీసుకున్నప్పుడు వారి పిల్లల్లో ఆటిజం (Autism), అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌ఆక్టివిటీ డిసార్డర్ (ADHD) వంటి నెరోలాజికల్ డిసార్డర్స్ ఉండటం జరిగింది. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
2.హార్మోన్ మార్పులు:
ప్యారసెటామోల్ గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క హార్మోన్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది శరీరంలోని సహజంగా ఉండే ఎండోక్రైన్ వ్యవస్థను నాశనం చేసే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
3.శిశువు టెస్టకిల్స్ పై ప్రభావం:
కొన్ని అధ్యయనాల ప్రకారం ప్యారసెటామోల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుష శిశువుల్లో టెస్టికల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
గమనించవలసిన ముఖ్యమైన విషయాలు:
* గర్భిణీ స్త్రీలలో ప్యారసెటామోల్ ప్రభావంపై పరిశోధనలు జరిగిన విషయం నిజమే. కానీ, కొన్ని విషయాలను మాత్రం పూర్తిగా నిర్ధారించలేదు.
* ఇప్పటి వరకు సూచించినవి కేవలం సంబంధం ఉన్నట్టు మాత్రమే సూచించాయి కానీ, స్పష్టంగా దానివల్లనే సమస్యలు వచ్చాయని నిర్ధారించలేదు.
* డాక్టర్లు ఇప్పటికీ కూడా తగిన మోతాదులో, తగిన సమయంలో మాత్రమే ప్యారసెటామోల్ వాడమని సూచిస్తున్నారు.
* ప్యారసెటామోల్ అనేది సాధారణ వాడకంలో సురక్షితమైన ఔషధం.
* కానీ గర్భధారణ సమయంలో మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.