ఇప్పుడిదే ట్రెండ్.. ఇలాంటి ఉద్యోగుల కోసం దిగ్గజ టెక్‌ కంపెనీలే పోటీ పడుతున్నాయ్.. కోట్లు కుమ్మరించి ఉద్యోగంలోకి తీసుకుంటూ..  

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల ఏఐ సూపర్‌ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ కోసం విపరీతంగా నిధులు కేటాయించి నిపుణులను నియమించుకోవడాన్ని ప్రారంభించారు.

ఇప్పుడిదే ట్రెండ్.. ఇలాంటి ఉద్యోగుల కోసం దిగ్గజ టెక్‌ కంపెనీలే పోటీ పడుతున్నాయ్.. కోట్లు కుమ్మరించి ఉద్యోగంలోకి తీసుకుంటూ..  

AI talent war

Updated On : September 6, 2025 / 9:57 PM IST

AI talent war: ఇప్పుడు అంతా కృత్రిమ మేధదే హవా. అన్ని టాప్ కంపెనీలు దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఏఐ రంగంలో ఉన్న అతి కొద్ది మంది నిపుణుల కోసం పెద్ద టెక్ కంపెనీలు (ఓపెన్‌ఏఐ, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు) పోటీ పడుతూ వారిని ఆకర్షించడానికి కోట్ల రూపాయల జీతాలు, బోనస్‌లు ఇస్తున్నాయి.

ఏఐ టాలెంట్ వార్ విపరీతంగా పెరిగిపోతోంది. అగ్రశ్రేణి ఏఐ నిపుణుల కోసం టెక్ కంపెనీల మధ్య జరుగుతున్న పోటీ వల్ల ఏఐ మోడల్స్ నిర్మాణానికి కావలసిన వ్యయం కూడా విపరీతమైన పెరిగిపోతోంది. ఈ ఖర్చు బిలియన్ల డాలర్లకు చేరుతుంది. ఈ పెట్టుబడిని భరించగలిగిన సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

దీంతో అగ్రశ్రేణి ఏఐ నిపుణులకు డిమాండ్‌ ఓ రేంజ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఒక్కో అగ్రశ్రేణి ఇంజనీర్‌పై 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడాన్ని ఏఐ మోడల్స్ నిర్మాణానికి కావాల్సిన బిలియన్ల డాలర్లతో పోలిస్తే తక్కువ పెట్టుబడిగానే భావిస్తున్నాయి.

జుకర్‌బర్గ్‌ తెలివి చూడండి..

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల ఏఐ సూపర్‌ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ కోసం విపరీతంగా నిధులు కేటాయించి నిపుణులను నియమించుకోవడాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కేల్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్‌ వాంగ్‌ను ఆకర్షించి, నియమించుకున్నారు.

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. జుకర్‌బర్గ్‌ ఓపెన్‌ఏఐలోని అగ్రశ్రేణి ఏఐ నిపుణులను తమ సంస్థలోకి తీసుకోవడానికి 100 మిలియన్‌ సైన్‌ బోనస్‌ ఆఫర్‌ చేశారు. కాంపెన్సేషన్‌ ప్యాకేజీలు కూడా బాగా ఇచ్చారు.

మరోవైపు, “ఒక్క ఏఐ మోడల్‌ ను నిర్మించడానికి నేను ఒక బిలియన్‌ ఖర్చు చేస్తున్నాను. అలాంటప్పుడు ఒక ఇంజినీర్‌కి 10 మిలియన్‌ పెట్టడం తక్కువే” అని సింథేసియా హెడ్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ అండ్‌ పాలసీ అలెగ్జాండ్రు వోయ్కా అన్నారు.

గూగుల్‌ కూడా ఈ పోటీలో ఉంది. విండ్‌సర్ఫ్‌ అనే ఏఐ కోడింగ్‌ స్టార్టప్‌ సహ వ్యవస్థాపకుడు వరుణ్‌ మోహన్‌ను 2.4 బిలియన్‌ డాలర్ల ఒప్పందంతో గూగుల్‌ డీప్‌మైండ్‌లో చేరేలా చేసింది. ఇక గూగుల్‌ డీప్‌మైండ్‌ నుంచి 24 మందిని మైక్రోసాఫ్ట్‌ ఏఐ రిక్రూట్‌ చేసుకుంది.

“సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో 15 ఏళ్ల క్రితం నుంచే టాలెంట్‌ ఉన్నవారిని నియమించుకోవడంలో పోటీ ఉంది. కానీ ఏఐ మరింత శక్తిమంతం కావడంతో ఈ విభాగంలో నిపుణుల సంఖ్య స్థిరంగానే ఉంది” అని సింథేసియా ప్రతినిధి, మోహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కన్సల్టెంట్‌ వోయ్కా అన్నారు.

“డిమాండ్‌ పెరిగిపోయింది. సప్లై స్థిరంగా ఉంది. అందువల్లే వేతనాల ఇన్ఫ్లేషన్‌ వచ్చింది. మల్టీ మిలియన్‌ కాంపెన్సేషన్‌ ప్యాకేజీలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు” అని ఆయన చెప్పారు.

ఏఐ మోడళ్ల నిర్మాణ ఖర్చు బిలియన్లలో..

ఏఐ మోడళ్ల నిర్మాణం బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అందుకే నిపుణుల వేతనాలు కూడా పెరుగుతున్నాయి. సింథేసియా, కోహీర్‌, రెప్లికా, లవబుల్‌ వంటి సంస్థలు ప్రోడక్ట్స్‌ తయారు చేస్తాయి. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్‌, గూగుల్‌, మెటా వంటి సంస్థలు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ తయారు చేస్తాయి.

“వీటిని నిర్మించగలిగే కంపెనీలు కొన్నే ఉన్నాయి. బిలియన్ల డాలర్లు అవసరం అవుతాయి. అలాంటప్పుడు ఒక ఇంజినీర్‌కి 10 మిలియన్‌ పెట్టడం తక్కువే” అని వోయ్కా అన్నారు.

Also Read: రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన బోలెడన్ని సినిమాలు/సిరీస్‌లు ఇవే.. పండుగ చేసుకోండి..

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఏఐ ఇన్‌స్టిట్యూట్‌ రిపోర్టు ప్రకారం.. 2019-24 మధ్య పలు మోడళ్ల ఖర్చులు ఇలా ఉన్నాయి..

ఓపెన్‌ఏఐ జీపీటీ-4 – 79 మిలియన్‌ (2023)

గూగుల్‌ జెమిని 1.0 అల్ట్రా – 192 మిలియన్‌

మెటా ల్లామా 3.1-405B – 170 మిలియన్‌ (2024)

ఏఐ నిపుణుల డిమాండ్‌

లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ తయారు చేసే మిషన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్ల డిమాండ్‌ అమెరికా, యూరప్‌లలో చాలా ఎక్కువగా ఉంది.

రోబర్ట్‌ వాల్టర్స్‌ రిక్రూట్‌మెంట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ బెన్‌ లిట్వినాఫ్‌ ప్రకారం.. అనుభవజ్ఞులైన ఏఐ నిపుణులు, టాప్‌ యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ పూర్తిచేసిన రీసెర్చ్‌ సైంటిస్టులను వెంటనే టెక్‌ దిగ్గజాలు తీసుకుంటున్నాయి.

స్టార్టప్స్‌ వెనుకబడే ప్రమాదం

టెక్‌ దిగ్గజాలు భారీ వేతనాలు ఇస్తుండడంతో స్టార్టప్స్‌ వెనుకబడే పరిస్థితి ఉంది. “స్టార్టప్స్‌ పోటీ చేయలేకపోతున్నాయి. మోడళ్ల ఖర్చు ఎక్కువ. కానీ వాటిని కొనుగోలు చేసే సంస్థలు ఆ ధరలు భరించలేవు” అని వోయ్కా చెప్పారు.