Pitru Paksha 2025: పితృపక్షం.. తప్పకుండా చేయాల్సిన దానాలు ఇవే..! ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందడం ఖాయం..!

పితృపక్షం సమయంలో అసలు దానం ఎందుకు చేయాలి, వేటిని దానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు, ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..

Pitru Paksha 2025: పితృపక్షం.. తప్పకుండా చేయాల్సిన దానాలు ఇవే..! ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందడం ఖాయం..!

Updated On : September 6, 2025 / 9:08 PM IST

Pitru Paksha 2025: పితృపక్షం.. హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన సమయం. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కూడా. ఈ సమయంలో పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంతోషంగా ఉండొచ్చు. వారి ఆశీస్సులు ఉంటే శుభ ఫలితాలు పొందొచ్చు.

ఈ ముఖ్యమైన కాలంలో పితృదేవతలను గౌరవించాలి. తర్పణ వదలాలి. శ్రాద్ధం చేయాలి. దీంతో పాటు పేదలకు, అవసరమైన వారికి పలు దానాలు చేస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దలు చెబుతారు. మరి పితృపక్షం సమయంలో వేటిని దానం చేస్తే మంచిదో, ఎలాంటి దానాలో చేస్తే శుభ ఫలితాలు పొంది అదృష్టం పడుతుందో తెలుసుకుందాం.

పితృపక్షం సమయంలో చేయాల్సిన దానాలు..

అన్నదానం
పితృపక్షం సమయంలో అన్నదానం చేస్తే విశేష ఫలితాలను పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇస్తే పూర్వీకులు సంతోషపడి శుభ ఫలితాలను అందిస్తారని నమ్మకం. తిండికి లోటు ఉండదని, కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం.

వస్త్ర దానం
అవసరమైన వారికి కొత్త వస్త్రాలను పితృపక్షం సమయంలో దానం చేయాలి. తెల్లటి వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు, సాధువులకు వస్త్రాలను దానం చేయాలి.

రాగి వస్తువులు
రాగి వస్తువులను దానం చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదని, ఆర్థిక సమస్యలు తీరతాయని పెద్దలు చెబుతారు. పితృపక్షం సమయంలో రాగి పాత్రలో నీటిని నింపి ఎవరికైనా దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

నువ్వులు, నెయ్యి
నువ్వులు, నెయ్యిని దానం చేయాలి. నెయ్యి దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.

ధాన్యాలు, బెల్లం
ధాన్యాలు, బెల్లాన్ని కూడా పితృపక్షం సమయంలో దానం చేయడం మంచిది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

* బ్రాహ్మణులు, పేదలు, అనాథలకు ఆహారం, పండ్లు, కూరగాయలు ఇవ్వడం మంచిది.
* గోధుమలు దానం చేయడం చాలా శుభప్రదం.
* పేదలకు మందులు, వైద్య పరికరాలు దానం చేయొచ్చు. లేదా వైద్య చికిత్సలు చేయించొచ్చు.

Also Read: పితృపక్షం అంటే ఏమిటి? పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటివరకు ఉంటుంది..