Pitru Paksha 2025: పితృపక్షం.. కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే..! ఇలా చేస్తే పితృశాపాలు తొలగి అదృష్టం కలుగుతుంది..!

పితృపక్షాల్లో తద్దినం ఎప్పుడు పెట్టాలి? పిండ ప్రదానం ఎప్పుడు చేయాలి? పిండ ప్రదానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం..

Pitru Paksha 2025: పితృపక్షం.. కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే..! ఇలా చేస్తే పితృశాపాలు తొలగి అదృష్టం కలుగుతుంది..!

Updated On : September 6, 2025 / 7:04 PM IST

Pitru Paksha 2025: 2025 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి పితృపక్షాలు లేదా మహాలయపక్షాలు ప్రారంభం అవుతున్నాయి. పితృపక్షం అంటే చనిపోయిన పెద్దలకు ప్రియమైన రోజులు. ఈ రోజుల్లో మీ వంశంలో చనిపోయిన పెద్దలకు తర్పణాలు వదలడం, పిండాలు పెట్టడం, వారి పేరు మీద దానాలు చేయటం, స్వయంపాకం ఇచ్చుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటే.. మీ వంశానికి పితృదోషాలు, పితృశాపాలు లేకుండా అదృష్టం కలిసి వస్తుందని, పితృ దేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఆర్థికరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా బాగుంటుందని నమ్ముతారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం అవుతున్నాయి. మరి పితృపక్షాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పితృపక్షాల్లో తద్దినం ఎప్పుడు పెట్టాలి? పిండ ప్రదానం ఎప్పుడు చేయాలి?

మీ పితృ దేవతలు ఏ తిథి రోజు అయితే శరీరాన్ని విడిచిపెట్టారో ఆ తిథి రోజు వాళ్లకి ఈ పితృపక్షాల్లో తద్దినం పెట్టాలి. ప్రతి సంవత్సరం అందరూ తద్దినం పెట్టుకుంటారు. ఈ పితృపక్షాల్లో కూడా కచ్చితంగా తద్దినం పెట్టాలి. పిండ ప్రదానం చేయాలి. తర్పణం వదలాలి అని పండితులు సూచిస్తున్నారు. ఏ తిథి రోజున వారు శరీరాన్ని విడిచిపెట్టారో ఆ తిథి ఈ పితృపక్షాల్లో ఎప్పుడు వస్తే ఆ తిథి రోజు చేసుకోవాలి.

పితృపక్షాల్లో కచ్చితంగా పాటించాల్సిన నియమాలు..

పిండ ప్రదానం చేసే సమయంలో లేదా తద్దినం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు..

* తద్దినం పెట్ట రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు పెట్టాలి. దాన్ని అపరాహణ కాలం అని అంటారు. మధ్యాహ్నం 12 కంటే ముందు మాత్రం తద్దినం పెట్టకూడదు.
* తద్దినం పెట్టేటప్పుడు పిండాలు పెట్టే వారిని కర్త అంటారు.
* ఆ తద్దినాలు పెట్టాక భోజనం చేసే పంతులుని భోక్త అంటారు.
* తద్దినం పెట్టే వాళ్లు, ఆ భోజనం చేసే వాళ్లు.. అంటే కర్త, భోక్త ఇద్దరూ కూడా ఆ రోజు రాత్రికి అన్నం తినకూడదు. ఒకపూట మాత్రమే అన్నం తినాలి. రాత్రికి టిఫిన్ తీసుకోవాలి.
* ఏ రోజైతే తద్దినం పెడతామో ఆ రోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయకూడదు, నీళ్లు చల్లి వదిలేయాలి.
* పూజ గదిలో దీపం పెట్టొచ్చు, కానీ గంట మోగించకూడదు.
* తద్దినం పెట్టే రోజు తద్దినం వంట చేసే ఆడవాళ్లు ముందు రోజు నీళ్లతో వంట చేయకూడదు. ఆరోజు నీళ్లు తెచ్చుకోవాలి. ఆ రోజు నీళ్లతోనే తద్దినం వంట చేయాలి.
* తద్దినం వంట చేసేటప్పుడు నీళ్లలో చిటికెడు పసుసు కలిపాలి. పసుపు కలిపిన నీళ్లతోనే వంట చేయాలి.
* తద్దినం చేసే స్త్రీలు కుంకుమ పెట్టుకోకూడదు. విబూది బొట్టు పెట్టుకోవాలి.
* తద్దినం వంట చేసే స్త్రీలు మౌనంగా ఉండాలి. మాట్లాడకూడదు. మాట్లాడుతూ వంట చేస్తే ఫలితం ఉండదు.

Also Read: పితృపక్షం అంటే ఏమిటి? పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటివరకు ఉంటుంది..

* పెద్దలకు పిండాలు పెట్టాక భోజనాలకు కూర్చున్నప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే తద్దినం ఫలితం పోతుంది.
* పిండాలు పెట్టే వారు బంగారం ధరించకూడదు. అసలు బంగారాన్ని చూడకూడదు.
* వెండి ధరిస్తే చాలా మంచిది. వెండి చైన్ లేదా ఉంగరం పెట్టుకుని తద్దినం పెడితే చాలా మంచింది.
* ఉప్పుని చూడకూడదు.
* మేనల్లుడు పక్కన ఉంటే చాలా మంచిది.
* తద్దినం పెట్టే పరిసర ప్రాంతాలకు కోడి రాకూడదు, వరాహం తిరగకూడదు.
* తద్దినం భోజనంలో కొన్ని పదార్ధాలు ఉపయోగించకూడదు.
* పిండ ప్రదానాలు చేసేటప్పుడు భోజనంలో దోసకాయ, ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, అనపకాయ ఉపయోగించకూడదు.
* మహాలయపక్షాల్లో చనిపోయిన వాళ్లకు పిండాలు పెట్టే వారు జుట్టు కత్తిరించుకోరాదు.
* కొత్త దుస్తులు కొనుక్కోరాదు, బంధువుల ఇళ్లలో భోజనం చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవరాదు.

ఈ నియమాలు పాటిస్తూ తద్దినం పెట్టుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి.

ఈ నియమాలన్నీ పాటించలేము, సులభమైన మార్గం కావాలి అనుకునే వారు ఇలా చేయొచ్చు..
* పంతులుకి స్వయం పాకం ఇచ్చేయాలి.
* గోవుకి ఆహారం కోసం కొంత ధనం ఇవ్వాలి.
* పితృదేవతల పేర్ల చెప్పుకుని పంతులుకి స్వయం పాకం ఇచ్చినా, గోవుకి ఆహారం కోసం ధనం ఇచ్చినా.. పితృ దేవతలు ప్రీతి చెందుతారు. పితృదోషాలు, పితృశాపాలు ఉండవు.
* ఇంట్లోనే దక్షిణం వైపు చనిపోయిన పెద్దల ఫోటో పెట్టాలి.
* ఆ ఫోటో దగ్గర వారికి ఇష్టమైన నైవేద్యాలు వండి పెట్టాలి. దాన్ని కుటుంబసభ్యులు ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేసినా పితృదేవతల అనుగ్రహం పొందుతారు.
* మహాలయ పక్షాల్లో మేము పిండాలు పెట్టలేము, తర్పణాలు ఇవ్వలేము అనుకునే వాళ్లు ఇంట్లో దక్షిణం వైపు మరణించిన పెద్దల ఫోటో పెట్టి పూలమాలతో అలకరించి దీపం పెట్టి వారికి ఇష్టమైన నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించినా పితృ దేవతల అనుగ్రహం కలుగుతుంది.