Pitru Paksha 2025: పితృపక్షం.. ఈ సమయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు..! లేదంటే..

పితృపక్షాల సమయంలో చేయకూడని పనులు ఏవీ, ఒక వేళ పొరపాటున అవి చేస్తే ఏం జరుగుతుంది.. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

Pitru Paksha 2025: పితృపక్షం.. ఈ సమయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు..! లేదంటే..

Updated On : September 6, 2025 / 10:58 PM IST

Pitru Paksha 2025: పితృపక్షం.. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం. ఈ సమయంలో పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంతోషంగా ఉండొచ్చని, వారి ఆశీస్సులు ఉంటే శుభ ఫలితాలు పొందొచ్చని పెద్దలు చెబుతారు. మరణించిన పెద్దల ఆత్మకు శాంతి కలిగేందుకు, వారి ఆశీర్వాదం పొందేందుకు శ్రాద్ధం చేస్తారు. ఇలా చేస్తే వారు స్వర్గ లోకానికి చేరుకుంటారని నమ్మకం. కాగా, పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలలో అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం..

తర్పణాలు, శ్రాద్ధం, ఆబ్దికం పెట్టిన రోజు చేయకూడని పనులు..

* పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించకూడదు.
* ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.
* మొక్కులు తీర్చుకోకూడదు.
* ఇల్లు మారకూడదు.
* పెద్దగా అరవకూడదు.
* ఏడవకూడదు.
* పితృదేవతలు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.

* జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు.
* కొత్త వస్తువులు కొనకూడదు.
* ఈ సమయంలో ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు.
* ప్రయాణాలు చేయకూడదు.
* కొత్త ఇళ్లలోకి వెళ్లకుండా ఉండటం మంచిది.
* కొత్త వాహనాలు కొనకూడదు.
* ఒక చేత్తో భోజనం వడ్డించకూడదు.

శ్రాద్ధం, ఆబ్దికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు..

* క్రతువు చేసే రోజున ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయకూడదు.
* పూజ చేసుకోవచ్చు కానీ గంట కొట్టకూడదు.
* తలస్నానం చేయకూడదు.
* ఆబ్ధికం కానీ శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరూ తల దువ్వుకోకూడదు.
* గట్టిగా మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి.
* భోక్తలను మాట్లాడించకూడదు. భోజనం రుచి గురించి అడక్కూడదు.
* పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడద.
* ఆబ్దికం పూర్తయ్యే వరకు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు.
* ఆబ్దికం వంటలకు సంబంధించిన నీటి షింకులో, బయట పోయకూడదు.
* ఆ నీటిని ఒక పాత్రలో పోసుకోవాలి. ఆబ్దికం పూర్తయ్యాక బయటపారబోయాలి.

ఈ నియమాలు పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు అర్పించడం, శ్రాద్ధం, తద్దినం పెట్టడం వల్ల లేదా స్వయంపాకం దానం వల్ల పూర్వీకులు తృప్తి చెందుతారు. వారి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందొచ్చు. పితృ దేవతల కృప మనపై ఉంటే సకల సంపదలు సిద్ధిస్తాయని, వంశం కూడా సుభీష్టంగా ఉంటుందని నమ్ముతారు. ఈ మహాలయ పక్షాలలో పెద్దలకు పిండ ప్రదానం, శ్రాద్ధం చేయాలి. అంత శక్తి లేని వారు కనీసం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి.

స్వయంపాకంలో కచ్చితంగా ఉండాల్సిన వస్తువులు..

* పెసరపప్పు
* బియ్యం
* తోటకూర
* అరటికాయ
* కాకరకాయ
* పచ్చిమిరపకాయలు
* కందగడ్డ
* అల్లం
* తెల్ల నువ్వులు
* చింతపండు
* నూనె
* ఆవు నెయ్యి
* ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు
* మోదుగాకు విస్తరి ఇవ్వాలి. లేదంటే అరటి ఆకు ఇవ్వాలి.
* దక్షిణ ఇవ్వాలి.

Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఏం చేయాలి? అస్సలు చేయకూడని తప్పులు ఏంటి?