Allu Arjun : నాకు కూడా ఆ అబ్బాయి అంత ఏజ్ ఉన్న కొడుకు ఉన్నాడు.. నేనెందుకు కేర్ తీసుకోను..
నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Allu Arjun Emotional while Talking about injured guy in Sandhya Theater Incident
Allu Arjun : పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన సంఘటన సంచలనంగా మారింది. నేడు అసెంబ్లీలో ఈ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Allu Arjun : నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు.. నేనసలు రోడ్ షో చేయలేదు.. ఎమోషనల్ అయిన బన్నీ..
ఈ ప్రెస్ మీట్ లో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు, నాకు ఆ అబ్బాయిని కలవడానికి పర్మిషన్ లేదనే నేను కలవలేదు అని తెలిపారు. అలాగే నేను బాధ్యతారాహిత్యంగా ఉన్నాను, కేర్ తీసుకోలేదు అని అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. నేను వేరే ఫ్యాన్స్ చనిపోయినపుడే వైజాగ్, విజయవాడ వెళ్లి కలిసాను. అలాంటిది నేను ఎందుకు నా ఫ్యాన్ కోసం వెళ్ళాను. పర్మిషన్ లేకపోవడంతో కలవలేకపోవడంతోనే అందుకే నెక్స్ట్ రోజే నేను వీడియో పెట్టాను. దాంతో మా నాన్నని, కానీ సుకుమార్ ని కానీ వెళ్లి కలవమన్నాను. మా నాన్న పర్మిషన్ తీసుకొని వెళ్లారు. నేను అందరితో డబ్బులు ఇద్దామా, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించాలి అన్ని రకాలుగా ఆ బాబు గురించే చర్చించాను. నాకు కూడా అంత ఏజ్ ఉన్న అబ్బాయి ఉన్నాడు. నేను ఎందుకు కేర్ లేకుండా ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు.