Allu Arjun : నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు.. నేనసలు రోడ్ షో చేయలేదు.. ఎమోషనల్ అయిన బన్నీ..
నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Allu Arjun Reaction on CM Revanth Reddy Comments in Assembly goes Viral
Allu Arjun : పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో నేడు ఈ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : CM Revanth Reddy : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?
దీంతో నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఎవ్వర్నీ బ్లేమ్ చెయ్యట్లేదు. నా మీద తప్పుడు ఆరోపణలు వచ్చాయి. సినిమా పెద్ద సక్సెస్ అయినా నేను అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే ఉండి బాధపడుతున్నాను. నా తప్పు లేకపోయినా అనుకోకుండా జరిగింది కాబట్టి సారీ. నా క్యారెక్టర్ మీద తప్పుడు ఆరోపణలు చేశారు. నేను అలా అన్నాను, ఇలా అన్నాను అని తప్పుడు ఆరోపణలు చేశారు. మూడేళ్ళుగా కొన్ని కోట్లు పెట్టి ఎమోషనల్ గా ఒక సినిమా చేసాం కాబట్టి థియేటర్లో సినిమా చూడాలని వెళ్ళాను. నేనేదో భాద్యతా రాహిత్యంగా వెళ్ళలేదు. నేను వెళ్ళేసరికే పోలీసులే అక్కడ క్లియర్ చేస్తున్నారు. దాంతో పర్మిషన్ ఉందనే అనుకున్నాను. నేను రోడ్ షో చేయలేదు. థియేటర్ ముందు జనాలు చుట్టుముట్టడంతో కార్ ఆగిపోయింది. దాంతో నేను కనపడితే ఫ్యాన్స్ కొంత జరుగుతారు అని నేను బయటకు వచ్చాను. అంతమంది వచ్చినప్పుడు హీరో లోపల కూర్చుంటే ఎలా ఉంటుంది. అందుకే బయటకు వచ్చి హలో చెప్పి పదండి పదండి అని చేతులు ఊపాను. నా దగ్గరికి పోలీసులు ఎవ్వరూ రాలేదు. నా టీమ్ వాళ్ళు వచ్చి బయట ఆపలేకపోతున్నాం వెళ్లిపోండి అంటే వెంటనే వెళ్లిపోయాం. అసలు ఆమె చనిపోయింది అని నెక్స్ట్ డే వరకు తెలీదు. అది వినగానే షాక్ అయ్యాను. నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నారు అని తప్పుడు ఆరోపణలు చేశారు. వెంటనే బన్నీ వాసుకి కాల్ చేసి హాస్పిటల్ కి వెళ్ళు అక్కడ పరిస్థితి కనుక్కోమని చెప్పాను. నేను హాస్పిటల్ కి వస్తాను అన్నాను. కానీ వాసు.. వద్దు హాస్పిటల్ కి రావొద్దు ఇప్పుడు మీరొస్తే ప్రాబ్లమ్ అవుద్ది. వాళ్ళు కేసు ఫైల్ చేశారు. మీరు వస్తే లీగల్ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పడంతో వెళ్లకుండా ఆగాను. నాకు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి నేను ఇప్పుడే వెళ్లి ఆ అబ్బయిని చూస్తాను అని తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. అవన్నీ పూర్తిగా అబద్దపు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.