CM Revanth Reddy : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?
సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడిన తర్వాత హీరోలు, సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ని పరామర్శించిన దాని గురించి స్పందిస్తూ సీరియస్ అయ్యారు.

CM Revanth Reddy Fires on Film Celebrities Who went to Allu Arjun Home
CM Revanth Reddy : సంధ్య థియేటర్ దగ్గర మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తర్వాత బాయిల్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు జరిగిన సంగతిని వివరించారు. అలాగే హీరోని అరెస్ట్ చేసినందుకు నన్ను తిడుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడిన తర్వాత హీరోలు, సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ని పరామర్శించిన దాని గురించి స్పందిస్తూ సీరియస్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు తమ విధి నిర్వహిస్తే కొంతమంది రాజకీయ నాయకులు నన్ను తిట్టుకుంటూ నీచంగా పోస్టులు పెట్టారు. ఒక 30 వేలు సంపాదించే మాములు వ్యక్తి కొడుకు ఆ హీరో అభిమాని అన్ని నాలుగు టికెట్లు ఒక్కోటి 3000 పెట్టి 12 వేలకు టికెట్లు కొని సినిమాకు వెళ్తే ఇలా జరిగింది. చనిపోయిన 11వ రోజు వరకు హీరో కానీ నిర్మాత కానీ ఎవరూ ఆ కుటుంబాన్ని కానీ, ఆ హాస్పిటల్ లో ఉన్న పిల్లవాడిని కానీ పరామర్శించడానికి వెళ్ళలేదు. ఇలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీసులు విధి నిర్వహణ భాగంగా హీరోని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఓ మంత్రి ఆ హీరోని అరెస్ట్ చేస్తారా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. పరోక్షంగా చావుకు కారణం అయిన వాళ్ళను విచారణకు పిలిస్తే నన్ను తిట్టారు. నీచమైన భాషని వాడి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టారు. మేము సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మేమే ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చాము. రేట్లు పెంచాము. ప్రోత్సహించే క్రమంలో ప్రాణాలు పోతే వాళ్ళను ఏమొద్దు అంటే ఎలా? ఒక్కరోజు అతను జైలుకి వెళ్ళొస్తే సినీ ప్రముఖులు అంతా ఆ హీరో దగ్గరకు వెళ్లి అతనికి ఏదో అయినట్టు పరామర్శించారు. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?. అందులో ఒక్కరైనా వెళ్లి ఆ కుటుంబాన్ని కానీ, ఆ బాలుడిని కానీ పరామర్శించారా అంటూ ప్రశ్నించారు.