CM Revanth Reddy : అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.. పోలీసులు వెళ్లిపొమ్మని చెప్పినా వినలేదు.. రేవంత్ రెడ్డి కామెంట్స్..
అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన గురించి ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనపై మాట్లాడుతూ కామెంట్స్ చేసారు.

CM Revanth Reddy Sensational Comments on Allu Arjun and Sandhya Theater Incident
CM Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంధ్య థియేటర్ ఘటన గురించి ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనపై మాట్లాడుతూ కామెంట్స్ చేసారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే మూడో తారీఖు పోలీసులు తిరస్కరించారు. నాలుగో తారీఖున ఎవరూ థియేటర్ కి రావొద్దు మేము పర్మిషన్ ఇవ్వము అని తిరస్కరించినా హీరో రాత్రి 9.30కి వచ్చి సైలెంట్ గా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేదేమో కాదు. కానీ చౌరస్తా నుంచే కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్తూ వెళ్తుండటంతో అక్కడ వేలాది మంది వచ్చారు. హీరో థియేటర్ లోపలికి వెళ్లేముందు ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలి తీసుకెళ్లాల్సిన బౌన్సర్లు అందరు అభిమానులను ఇష్టమొచ్చినట్టు తోశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఒకేసారి అంతమంది రావడంతో తొక్కిసలాట జరిగి ఆమె చనిపోయింది. పోలీసులు అందర్నీ చెదరగొట్టేసరికి ఆ తల్లి శవమై ఉంది. ఆ తల్లి తన కొడుకుని కాపాడుకోవాలని చాలా ప్రయత్నించింది. పోలీసులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆమె హాస్పిటల్ కి వెళ్లే సమయంలో చనిపోయింది. ఆ బాలుడు కోమాలోకి వెళ్ళాడు. థియేటర్లో కూడా హీరోని కలవాలని తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులు వచ్చి హీరోకి ఈ విషయం చెప్పాలని వెల్దామంటే థియేటర్ వాళ్ళు హీరోని కలవడానికి వీల్లేదు అన్నారు. దాంతో ACP కోపం వచ్చి సీరియస్ గా మాట్లాడి లోపలికి వెళ్లి హీరోకి.. ఒకరు చనిపోయారు. మీరు ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు వెళ్ళిపోవాలి అంటే లేదు సినిమా చూసి వెళ్తా అని ఆ హీరో చెప్పినట్టు నాకు సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. దాంతో పై అధికారి రంగంలోకి దిగి హీరోకి చెప్పి ఇక్కడ్నుంచి మీరు వెళ్ళాలి అని అతన్ని తీసుకెళ్లి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ అభిమానులను చూసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కొంతమంది థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి హీరోని మీరు A11 అని చెప్తే అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఆ తర్వాత అరెస్ట్ చేసారు అని అన్నారు.
దీంతో అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.