pawan kalyan allu arjun
Pawan Kalyan – Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజయి భారీ సక్సెస్ అయినందుకు నేడు మూవీ యూనిట్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పటికే ఈ సినిమా పెద్ద హిట్ అయి రెండు రోజుల్లోనే 449 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సాధించింది. దీంతో మూవీ యూనిట్ ఈ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.
Also Read : Pushpa 2 collections : బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా.. రెండు రోజుల్లో పుష్ప 2 కలెక్షన్ ఎంతంటే?
ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ మూవీకి పనిచేసిన వారందరికీ, సపోర్ట్ చేసిన వారికి అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు పెంచినందుకు థ్యాంక్స్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మీరు సినీ పరిశ్రమకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అని అన్నారు. అలాగే.. టికెట్ రేట్లు పెంచేందుకు సహకరించిన , ఈ స్పెషల్ జీవో పాస్ అవ్వడానికి ముఖ్య కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ సో మచ్. మీ నిర్ణయంతో మమ్మల్ని హత్తుకున్నారు అని అన్నారు.
అయితే స్పెషల్ గా కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ – పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పుమనగా చెప్పను బ్రదర్ అని మొదలైన ఆ వివాదం ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతకు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో తారాస్థాయికి చేరింది. మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీల మధ్య కూడా దీనివల్ల విబేధాలు వచ్చాయని అంతా భావించారు.
ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని విమర్శించారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో వార్ చేశారు. సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్ కి, చిరంజీవికి కౌంటర్ గా ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇక అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా ఆఫ్యాన్స్ అని మాట్లాడి ఇప్పుడు అల్లు ఆర్మీ, బన్నీ ఫ్యాన్స్ అంటూ మాట్లాడటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఇన్ని జరుగుతున్న అల్లు అర్జున్ ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోవడం గమనార్హం. కానీ పుష్ప రిలీజ్ ముందు బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ లో స్పెషల్ గా కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడంతో ఈవెంట్లో అందరూ అరిచారు. బన్నీ కూడా చాలా సంతోషంగా ఈ కామెంట్స్ చేశారు. దీంతో ఫ్యామిలీల మధ్య విబేధాలు – వివాదాలు మాత్రం ఏమి లేవని అర్ధమవుతుంది అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఇప్పటికైనా వివాదాలు ఆపుతారా చూడాలి. బన్నీ డైరెక్ట్ గా చెప్పిన థ్యాంక్స్ కి జనసైనికులు, పవన్, మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారా చూడాలి.