Allu Arjun : ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’.. అల్లు అర్జున్ టీ షర్ట్ మీద ఏముందో చూశారా? వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ బయటకు వచ్చాయి.

Allu Arjun T Shirt with Social Media Viral Dialogue Photos Videos goes Viral

Allu Arjun : సోషల్ మీడియాలో, సినిమాల్లో బాగా వైరల్ అయిన డైలాగ్స్ తో ఇటీవల టీ షర్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ టీ షర్ట్ మీద డైలాగ్స్, నవ్వించే ఫొటోలు ప్రింట్ అయి వస్తున్నాయి. అలాంటి టీ షర్ట్ ఒకటి అల్లు అర్జున్ ఇప్పుడు వేసుకోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Savitri : సావిత్రి ఇల్లు ఈయన కొన్నారంట.. ఇప్పటికి అదే పేరుతో.. సావిత్రమ్మ పెద్ద ఫొటో ఫ్రేమ్ వాళ్ళ కూతురు తీసుకెళ్ళిపోతే..

తాజాగా అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ బయటకు వచ్చాయి. బన్నీ ఒక వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ టీ షర్ట్ మీద ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్ లో రాసి ఉంది. అలాగే బ్రహ్మనందం ఆ సీన్ లో నవ్వించే హావభావాల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో బన్నీ వేసుకున్న టీ షర్ట్ వైరల్ గా మారింది.

బన్నీ కూడా సోషల్ మీడియాని బాగానే ఫాలో అవుతున్నాడు అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ వీడియోలు, ఫోటోలు షేర్ చేసి సరదాగా మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.

Also Read : Bullet Bhaskar – Mahesh Babu : ఆ సినిమాకు మహేష్ బాబుకు మొత్తం డబ్బింగ్ నేను చెప్పాను.. నా డబ్బింగ్ చూసి మహేష్ గారు ఏమన్నారంటే..?