Savitri : సావిత్రి ఇల్లు ఈయన కొన్నారంట.. ఇప్పటికి అదే పేరుతో.. సావిత్రమ్మ పెద్ద ఫొటో ఫ్రేమ్ వాళ్ళ కూతురు తీసుకెళ్ళిపోతే..

తన లలిత జ్యువెల్లర్స్ కి గుండు లుక్స్ లో యాడ్స్ చేసి బాగా పాపులర్ అయ్యారు ఆ జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్.

Savitri : సావిత్రి ఇల్లు ఈయన కొన్నారంట.. ఇప్పటికి అదే పేరుతో.. సావిత్రమ్మ పెద్ద ఫొటో ఫ్రేమ్ వాళ్ళ కూతురు తీసుకెళ్ళిపోతే..

Lalithaa Jewellery Owner Kiran Kumar Buys Savitri Ganeshan House in Chennai

Updated On : May 2, 2025 / 3:42 PM IST

Savitri : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన మహానటి సావిత్రి చివర్లో విషాదంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత కథతో మహానటి సినిమా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. సావిత్రి నటన అంటే అందరికి ఇష్టమే. చాలా మంది సెలబ్రిటీలు సైతం ఆమె అభిమానులే. చెన్నైలో ఉన్న సావిత్రి గణేశన్ అనే ఒక ఇంటిని లలిత జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్ కొన్నారట.

తన లలిత జ్యువెల్లర్స్ కి గుండు లుక్స్ లో యాడ్స్ చేసి బాగా పాపులర్ అయ్యారు ఆ జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఆసక్తికర విషయం చెప్పారు.

Also Read : Bullet Bhaskar – Mahesh Babu : ఆ సినిమాకు మహేష్ బాబుకు మొత్తం డబ్బింగ్ నేను చెప్పాను.. నా డబ్బింగ్ చూసి మహేష్ గారు ఏమన్నారంటే..?

కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. మాకు చెన్నైలో బ్రాంచెస్ పెరగడంతో కార్పొరేట్ ఆఫీస్ కి ఒక ప్లేస్ కావాలి. అప్పుడు చెన్నైలో సావిత్రి గారి ఇల్లుని రెంట్ కి తీసుకున్నాం. అందులో నాలుగు ఫ్లోర్స్ ఉంటే మూడు ఫ్లోర్స్ మావే. పైన ఫ్లోర్ లో సావిత్రమ్మ కూతురు వాళ్ళు ఉండేవాళ్ళు. మేము సొంత బిల్డింగ్ కొన్నాక అందులోంచి వెళ్ళిపోదామని సావిత్రమ్మ కూతురుకు చెప్తే మేమే వెళ్ళిపోతున్నాము, కొత్త ఇల్లు కట్టుకున్నాము. ఈ బిల్డింగ్ నువ్వే తీసుకో అని కొంత అమౌంట్ చెప్పారు.

నేను ఓకే చెప్పి ఆ బిల్డింగ్ ని నేనే కొనుక్కున్నాను. ఆ బిల్డింగ్ లో ఎంట్రెన్స్ లిఫ్ట్ దగ్గర సావిత్రమ్మ గారిది పెద్ద ఫొటో ఫ్రేమ్ ఉండేది. ఒకరోజు అది లేదు. అడిగితే సావిత్రమ్మ కూతురు వాళ్ళు తీసుకెళ్లిపోయారు అని మా స్టాఫ్ చెప్పారు. నేను వెంటనే వాళ్లకు ఫోన్ చేసి నాకు ఆ ఫోటో కావాలి, మీకు కావాలంటే మంచి ఫోటో చేసి నేను పంపిస్తాను అన్నాను. నేను వెంటనే మనిషిని పంపించి ఫోటో తెప్పించి పెట్టాను. ఆ ఫోటోలో సావిత్రి గారు నవ్వుతూ ఉంటారు. నేను కోపంలో వెళ్లినా ఆ ఫోటోలో సావిత్రమ్మ గారిని చూడగానే నవ్వుతాను. ఇప్పటికి ఆ ఫొటో ఫ్రేమ్ అక్కడే ఉంది. ఇవాళ్టికి మా బిల్డింగ్ కి సావిత్రి గణేశన్ అనే పేరే ఉంటుంది. మేము చెన్నైలో ఓ పెద్ద బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీస్ కి కొన్నాము. అక్కడికి షిఫ్ట్ అయినా ఈ బిల్డింగ్ కూడా వాడతాము అని తెలిపారు.

Also Read : Bullet Bhaskar : 5 కోట్ల సినిమా చేసి 100 కోట్లు కొడతా.. నా కథల్ని తీసుకొని వాళ్ళు సినిమాలు చేసుకున్నారు.. డైరెక్టర్ గా బులెట్ భాస్కర్..