Allu Arjun : కూతురి కోసం శాకుంతలం సెట్‌కి వెళ్లిన అల్లు అర్జున్
శాకుంతలం సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ వెండి తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా స్కూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
- kunduru Vinod
- Updated on- August 7, 2021 / 03:28 PM IST
Allu Arjun
Allu Arjun : గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా తెరకెక్కుతుంది. గుణ టీం వర్క్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ – స్నేహరెడ్డిల కూతురు అర్హ వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అర్హ. ఇక ఇప్పటికే 10 రోజుల షూటింగ్ పూర్తి చేసిన అర్హ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రకరిస్తుంది బృందం.
అల్లు అర్హ ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తున్నారు. భరతుడు పాత్రలో అర్హ ఒదిగిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అర్హను సెట్స్ లో చూడాలని అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అర్హ సోదరుడు అయాన్ స్కూటింగ్ స్పాట్ కి వచ్చారు. కూతురు పర్ఫామెన్స్ చూసి అర్జున్ మురిసిపోయారు. ప్రస్తుతం బన్నీ శాకుంతలం సెట్‌ని సందర్శించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాని ఎంతగా షేక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
