Buddy OTT : ఓటీటీలోకి అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అల్లు శిరీష్ హీరోగా నటించిన మూవీ బడ్జీ.
- Thota Vamshi Kumar
- Published on- August 25, 2024 / 11:29 AM IST
Allu Sirish Buddy OTT release date Fix
Buddy OTT Release : అల్లు శిరీష్ హీరోగా నటించిన మూవీ బడ్జీ. సామ్ అంటోన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ కథానాయిక. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నిర్మించారు. అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి స్పందన తెచ్చుకుంది.
ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త ఇది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్సైంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. హిందీ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదుగానీ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కానుంది.
Mahesh Babu : సినిమాల్లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు వారసులు..!
కథ : ఆదిత్య రామ్(అల్లు శిరీష్) ఓ పైలట్. పల్లవి(గాయత్రీ భరద్వాజ్) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లో పని చేస్తూ ఉంటోంది. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో పరస్పరం చూసుకోకున్నా వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. వీరిద్దరు కలుసుకుదాం అనుకునే సమయంలో ఓ సంఘటన వల్ల ఆదిత్య జాబ్ పోతుంది. తన వల్లే ఆదిత్య ఉద్యోగం పోయిందని, అతడిని నేరుగా కలిసి సారీ చెప్పాలని అనుకున్న పల్లవి కిడ్నాప్ అవుతుంది.
ఈ క్రమంలో ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. ఆమె ఆత్మ ఓ టెడ్డీ బేర్లోకి వెలుతుంది. ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటకు ఎలా వచ్చింది..? అసలు పల్లవిని ఎందుకు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ ముఠాతో హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్‌కుమార్ వర్మ (అజ్మల్)కు ఉన్న సంబంధం ఏంటి..? పల్లవిని ఆదిత్య కాపాడాడా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Suhas : యంగ్ హీరో సుహాస్ డేరింగ్ స్టెప్!
