ఛాలెంజ్ పూర్తి చేసిన శిరీష్..

  • Publish Date - July 4, 2020 / 02:33 PM IST

హీరో విశ్వక్ సేన్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన అల్లు హీరో శిరీష్ తాజాగా తన ఇంటికి సమీపంలో మొక్కలు నాటాడు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి మరికొంత మందిని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. హీరో విశ్వక్ సేన్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన అల్లు హీరో శిరీష్ తాజాగా మరికొందరిని దీనికి నామినేట్ చేశాడు.

ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి అభినందనలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప‌ర్య‌ావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అత్యంత అవ‌స‌రం. అందుకే అందరూ విధిగా మొక్క‌లు నాటాల‌ని కోరుతున్నాను. ఈ ఛాలెంజ్‌కు నా మేన‌ల్లుడు ఆర్నావ్, మేన‌కోడ‌ళ్లు అన్విత‌, స‌మారా, నివ్రితిల‌ను నామినేట్ చేస్తున్నాను. చెట్ల‌ను ఎలా నాటాలి, వాటిని ఎలా సంరక్షించాలనే విష‌యం తర్వాతి తరాల వారికి తెలియ‌డం చాలా అవ‌స‌ర‌ం. అందుకే వారిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను’ అని శిరీష్ చెప్పాడు.

 

Read:తమ్ముడిగా నటించాడు.. మర్చిపోలేక పోతున్నా..